Big Stories

Telangana Elections | పల్లెబాట పట్టిన జనం.. ఓటు హక్కు కోసం సీటు తిప్పలు!

Share this post with your friends

Telangana Elections | తెలంగాణ ప్రజలు తమ హక్కుల వినియోగంలో మిగతా రాష్ట్రాల ప్రజల కంటే ముందంజలో ఉంటారు. తమ నియోజకవర్గం వదిలి ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలో నివసించే ఓటర్లు ఎన్నికల వేళ్ల ఓటు వేయడానికి తమ ప్రదేశానికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసి పోతాయి.

రేపు ఉదయం పోలీంగ్ ప్రారంభకానుండడంతో ఇప్పుడు నగరంలో నివసించే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. ఈ కారణంగా హైదరాబాద్ నుంచి జనం తండోప తండాలుగా పల్లె బాట పట్టారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చినవారు ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలివెళుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో వెళ్లేందుకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడంతో సీట్లు దొరకడం లేదు. అందుకే బస్సుల కోసం వేచి చూస్తున్నారు.

ఎన్నికల సమయంలో రైల్వస్టేషన్, బస్టాండుల్లో జనం రద్దీగా ఉండడం సహజమే. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల వేళ ఈ రద్దీ కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది.

ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. సీట్లు దొరకక నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు, బస్సుల కోసం జనం కోసం వేచి ఉంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని కంపెనీలు నవంబర్ 30న సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు వేలాది మంది సొంత వాహనాల్లో తమ నియోజకవర్గాలకు బయలుదేరారు.

.

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News