E-Paper
Advertisement

Maganti Gopinath | బీఆర్ఎస్ కోసం డబ్బులు పంచుతూ పట్టుబడ్డ జీటీఎస్ టెంపుల్ చైర్మన్

Maganti Gopinath | మరికొన్ని గంటల్లో పోలింగ్ కానుండడంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల అనుచరులు ఓటర్ల వద్దకు వచ్చి డబ్బులు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్నారమేష్‌ మంగళవారం రాత్రి మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ చేతికి చిక్కారు.

జూబ్లి హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అనుచరుడైన జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్నారమేష్‌ డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వద్ద రూ.43,500 స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

ఇలాంటిదే మరొక సంఘటన సంఘటనలో ఎల్లారెడ్డి గూడలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి ఎల్లారెడ్డి గూడలో డబ్బులు పంచుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులు వారి నుంచి రూ.25,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియడంతో స్థానికంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కానీ పోలీసులు మధ్యలో కలుగచేసుకొని పరిస్థితిని అదుపుచేశారు.

ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డబ్బులతో ఓటర్లకు ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ , ఇతర పార్టీ నాయకులు మండి పడుతున్నారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×