BigTV English

Chandrababu Release Update: రాజమండ్రి టు ఉండవల్లి @14 గంటలు.. అడుగడుగునా బ్రహ్మరథం

Chandrababu Release Update: రాజమండ్రి టు ఉండవల్లి @14 గంటలు.. అడుగడుగునా బ్రహ్మరథం
Chandrababu Release Update

Chandrababu naidu news today(AP politics) :

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు బయలుదేరగా.. టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ఆయనకు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. ఆయన రాజమండ్రి నుంచి విజయవాడకు చేరుకునేందుకు 14 గంటలకు పైగా సమయం పట్టింది. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు.


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు షెడ్యూల్ మారింది. వాస్తవానికి ఇవాళ తిరుపతికి వెళతారని.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు వెళ్లాలని భావించారు. కానీ ఆయన నేరుగా హైదరాబాద్‌ వెళ్లనున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయన అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని.. ఎవరినీ కలవరని టీడీపీ నేతలు చెబుతున్నారు.

దాదాపు పద్నాలుగనర్న గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబు అలసిపోయారు. చంద్రబాబు ఇంటికి చేరుకునే సరికే.. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతులు, మహిళలు భారీగా గుమిగూడారు.పెద్దఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నినాదాలు చేశారు.


Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×