BigTV English

Iswarya Rai Beauty secrets : సెలబ్రిటీ బ్యూటీ సీక్రెట్స్.. ఐశ్వర్య అందం వెనుక అసలు రహస్యం అదే..

Iswarya Rai Beauty secrets : సెలబ్రిటీ బ్యూటీ సీక్రెట్స్.. ఐశ్వర్య అందం వెనుక అసలు రహస్యం అదే..

Iswarya Rai Beauty secrets : ఐశ్వర్య రాయి బచ్చన్.. ఈ పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చేది అందమైన నీలి కళ్ళు ఆపై మంత్రముగ్దులను చేసే చిరునవ్వు. ఎవరికైనా వయసు పెరుగుతుంటే ఆ ప్రభావం వారి చర్మం పై సులభంగా కనిపిస్తుంది కానీ ఐశ్వర్య విషయంలో ఆమె వయసు ఛాయలు కూడా ఆమె మేని చాయ్ పై కనిపించవు. ఇందుకు ముఖ్య కారణం ఆమె తీసుకునే డైట్ ,ఫాలో అయ్యే స్ట్రిక్ట్ డైలీ రొటీన్. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన ఐశ్వర్యారాయ్ అందాల వెనుక రహస్యాలు అమ్మాయిలకు నిధి కంటే గొప్పవే అనడంలో ఎటువంటి డౌట్ లేదు.


ఒకపక్క బాలీవుడ్..మరో పక్క హాలీవుడ్ లో రాణించడమే కాకుండా వివిధ రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది ఐశ్వర్య. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇవ్వగలిగే అందం ఐశ్వర్య సొంతం. సహజంగానే ఐశ్వర్యకు అందమైన ఒత్తయిన జుట్టుతో పాటు అద్భుతమైన ,కోమలమైన చర్మం ఉంది.మరి వీటిని మరింత పదిలంగా కాపాడుకోవడానికి ఐశ్వర్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. మరి అవేంటో తెలుసుకుందామా..

మనిషి జీవనశైలి ఎప్పుడైతే క్రమబద్ధంగా ఉంటుందో అప్పుడు వారి ఆరోగ్యంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. అందుకే ఐశ్వర్య ఎప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తుంది. జంక్ ఫుడ్ అసలు ముట్టుకోదు.. ఎక్కువగా ఇంటి వద్ద తయారు చేసిన తాజా కూరగాయలు ,పండ్లు ఎక్కువగా ఉండే భోజనాన్ని ఇష్టపడుతుంది. విటమిన్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ ,మినరల్స్ తన రోజువారి డైట్ లో పుష్కలంగా లభించే విధంగా ఐశ్వర్య జాగ్రత్తలు తీసుకుంటుందట. అలాగే రోజు శరీరానికి అవసరమైన తేమసేతాన్ని అందించడం కోసం బాగా మంచినీళ్లు తాగుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాము అప్పుడు సహజంగా మన చర్మం అందంగా మారుతుంది.


ఐశ్వర్య ఇంటి వద్ద తయారుచేసిన శనగపిండి, పాలు, పసుపు మిశ్రమాన్ని స్కిన్ ఎక్స్‌ఫోలియెంట్‌గా ఉపయోగిస్తుందట. ఇక మేకప్ విషయంలో కూడా ఐశ్వర్య తన స్కిన్ టోన్ ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ గా సెట్ అయ్యే షేడ్స్ ని ఎంచుకుంటుంది. ఆమె రెగ్యులర్ గా ఇష్టపడే కాస్మెటిక్ బ్రాండ్స్ లో మాక్, రెవ్లాన్, మేబెల్‌లైన్ ముఖ్యమైనవి. అలాగే ఐశ్వర్య మంచి ఫిట్నెస్ ఫ్రీక్.. తన ఫిగర్ బాగా మెయింటైన్ అవ్వాలి అని యోగా సాధన చేస్తుందట. అయితే షూటింగ్స్ కారణంగా కుదరని రోజుల్లో ఐశ్వర్య కంపల్సరిగా బ్రిస్క్ మార్నింగ్ వాక్ తేలికపాటి ఎక్సర్సిస్ పవర్ యోగ లాంటివి చేస్తుంది. అలాగే ఐశ్వర్య ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీ గా ఉండడానికి ప్రయత్నిస్తూ శరీరానికి అవసరమైన విశ్రామం కూడా అందేలాగా తన డైలీ రొటీన్ ప్లాన్ చేసుకుంటుంది. అందుకే ఇప్పటికీ ఐశ్వర్య అందానికి నిర్వచనం లాగా ఉంటుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×