E-Paper
Advertisement

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో
Advertisement

TUNI: ఏపీ సీఎం చంద్రబాబు తన రూటు, స్టయిల్ అంతా మార్చేసుకున్నారు. వీలైనంతగా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ సభ పెట్టినా నేరుగా ప్రజలతో మమేకం అవుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి తమతో మమేకం కావడంతో ప్రజల నుంచి మాంచి స్పందన వస్తోంది. ఇది కల నిజమా అంటూ చర్చించుకోవడం మొదలైంది.

బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు

Advertisement

అమరావతి.. శ్రీకాకుళం.. నెల్లూరు.. ఇప్పుడు తుని సభల్లో సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకం అయ్యారు.. అవుతూనే ఉన్నారు. సభ తర్వాత నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. సోమవారం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. చామవరంలో టూర్‌లో భాగంగా కల్లు గీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.

ఆ తర్వాత ఆ కుటుంబం గురించి అంతా తెలుసుకున్నారు. కల్లు గీత వృత్తి ద్వారా వస్తున్న ఆదాయ గురించి తెలుసుకున్నారు. సెక్యూరిటీని పక్కను పెట్టిన సీఎం, గీత కార్మికుడు సింహాచలంతోపాటు తాటికల్లు చెట్టు వద్దకు వెళ్లారు. కార్మికులు చెట్టు ఎక్కి కల్లు తీసే విధానాన్ని క్షుణ్ణంగా గమనించారు. బకెట్‌తో చెట్టు పైనుంచి కల్లు కిందకు దించే విధానం పరిశీలించారు. చెట్టు నుంచి తీసిన తాటి కల్లు రుచి చూశారు సీఎం చంద్రబాబు.

Advertisement

తాటి కల్లు టేస్ట్ చూసిన సీఎం చంద్రబాబు, వీడియో వైరల్

ఈ సన్నివేశాన్ని చూసిన బాలకృష్ణ అభిమానులు.. తమ అభిమాన నటుడ్ని సీఎం చంద్రబాబు మరిపిస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే అఖండ సినిమాలో హీరోయిన్‌తో కలిసి తాటి కల్లు తాగినట్టు ఓ సన్నివేశంలో కనిపించారు బాలకృష్ణ. తమ అభిమాన నటుడు తెరపై చేసింది రీల్ అయితే.. రియల్ లైఫ్‌లో సీఎం చంద్రబాబు ఈ విధంగా చేశారని అంటున్నారు.

రెండువారాల కిందట నెల్లూరు పర్యటకు వెళ్లారు సీఎం చంద్రబాబు. ఓ నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన సభకు హాజరైన సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పుకొచ్చారు. చేపలు కొనుగోలు చేసి మత్స్యకారుడు ఇంట్లో భోజనం చేశారు. ఈసారి ఏకంగా తాటి కల్లు టేస్ట్ చూశారని అంటున్నారు. మొత్తానికి ఏదో విధంగా సీఎం చంద్రబాబుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ALSO READ: వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్ 

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×