Big Stories

Chandrababu: ఏపీ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు ఇవే.. చంద్రబాబు

Chandrababu: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ఎన్నికల ఏపీ ప్రజల భవిష్యత్ ను మార్చే ఎన్నికలని చంద్రబాబు ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఆలోచించి ఓటును వేయాలని చంద్రబాబు కోరారు.

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నులు జిల్లాలోని ఆలూరులో నిర్వహించి బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీపై పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రస్తుతం.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని తీసుకువచ్చారంటూ ధ్వజమెత్తారు.

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ప్రాధన్యమిస్తామన్న జగన్ మాటలు ఇప్పుడేమయ్యాయన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లకే అధికారం అని చెప్పి.. వారిని దారుణంగా మోసగించారని అన్నారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రజల ఆదాయం ఏ స్థాయిలో పెరిగిందని ప్రశ్నించారు. విద్య కోసం జగన్ ప్రభుత్వం ఎంత మొత్తంలో ఖర్చుచేశారని.. వాటి వలన వచ్చిన ఫలితాలేంటని ఎండగట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంత్యత ధనికుడు జగన్ నే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read: త్వరలో.. హైకోర్టును ఆశ్రయిస్తా: వైఎస్ సునీత

రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎంతో అవకరమైన ఆరోగ్య శ్రీ బిల్లులను కూడా విడుదల చేయకుండా వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ఇష్టానుసారంగా భూములను వైసీపీ దోచుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News