E-Paper
Advertisement

Premalu 2: హిట్ సినిమాకు సీక్వెల్.. ఇక అధికారికం

Premalu 2: హిట్ సినిమాకు సీక్వెల్.. ఇక అధికారికం
Advertisement

Premalu 2: ఈ ఏడాది వచ్చిన మలయాళ సినిమాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం ప్రేమలు. నస్లెన్ గఫూర్, మమిత బైజు జంటగా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. మలయాళంలో ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్. ఎస్. కార్తికేయ మార్చి 8 న రిలీజ్ చేశాడు. ఇక్కడ కూడా ఈ యూత్ లవ్ స్టోరీ మంచి హిట్ ను అందుకుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల సొంత పేర్లను మర్చిపోయి సచిన్, రీను అనే తెలుగువారు పిలవడం విశేషం.

ఇక ఈ సినిమా తరువాత మమితాకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రేమలు చివర్లో సచిన్ దుబాయ్ కు వెళ్తుంటే రీను ఎయిర్ పోర్ట్ లో తన ప్రేమను వ్యక్తం చేసి.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ కు తెరలేపుతారు. ఇక ఇదే లైన్ తో గిరీష్ ఈ సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టాడు. ప్రేమలు 2 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

గతకొన్నిరోజులుగా నస్లెన్ గఫూర్ తోనే గిరీష్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ సినిమానే ప్రేమలు సీక్వెల్ అని తెలుస్తోంది. దీంతో ఈ సీక్వెల్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ కథలో ప్రేమలో ఉండే కోపాలు, అలకలు, చిరాకులు.. ఇలాంటివన్నీ చూపించనున్నాడట గిరీష్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ టీమ్ మరో హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×