BigTV English

Gang Rape in Ongole : మూగ యువతిపై కామాంధుల దాష్టీకం.. మూడు నెలలుగా అత్యాచారం

Gang Rape in Ongole : మూగ యువతిపై కామాంధుల దాష్టీకం.. మూడు నెలలుగా అత్యాచారం

Gang Rape in Ongole(Latest news in Andhra Pradesh): నిన్న తెలంగాణలో పసికందుపై అత్యాచారం, హత్య ఘటన కలకలం రేపింది. నేడు ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన వెలుగు చూసింది. మూగ యువతి.. నోరు విప్పి ఎవరికీ ఏమీ చెప్పలేదని పసిగట్టిన కామాంధులు.. మూడు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. కూతురు గర్భం దాల్చిందని తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చండ్రపాడులో జరిగిందీ ఘటన.


మూగ, చెవుడు అయిన ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉండేది. తల్లిదండ్రులు పనులకు వెళ్లేవారు. ఆ యువతి బలహీనత గమనించిన స్థానిక యువకుడు తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెకు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. అలాగే నటిస్తూ.. ఏడాదికాలంగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తానొక్కడే కాకుండా తన స్నేహితులను కూడా తీసుకొచ్చి అత్యాచారం చేయించాడు.

Also Read : పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య


ముగ్గురూ ఆ యువతిపై కామ వాంఛను తీర్చుకున్నారు. చేసిన పాపం ఏదొక రోజు బయటికి రాకపోదు కదా. ఆమె గర్భం దాల్చడంతో వారి దుర్మార్గం బయటపడింది. యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. యువతిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి పంపి.. వైద్యపరీక్షలు చేయించారు. బాధితురాలిని బెదిరించి.. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×