BigTV English

IND vs CAN Weather Report T20 WC 2024: వరుణుడి ఆటంకం?.. నేడు కెనడాతో టీమ్ ఇండియా మ్యాచ్

IND vs CAN Weather Report T20 WC 2024: వరుణుడి ఆటంకం?.. నేడు కెనడాతో టీమ్ ఇండియా మ్యాచ్

India vs Canada Weather Report T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఆడే ఆఖరి లీగ్ మ్యాచ్ నేడు ఫ్లోరిడాలో జరగనుంది. కెనడాతో జరగనున్న మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఫ్లోరిడాలో వర్షాలు పడటంతో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.


అయితే అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయ్యింది. అప్పటికి వర్షం లేకపోయినా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహించేందుకు అంగీకరించలేదు. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.

నేటి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదని అంటున్నారు. అంటే ఏమైనా వాతావరణం అనుకూలిస్తే మాత్రం లీగ్ లో ఆఖరి మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. అయితే ఫ్లోరిడాలో వర్షాల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఒకవేళ మ్యాచ్ నిర్వహించినా స్టేడియంకి ప్రేక్షకులు వచ్చేలా లేరని అంటున్నారు.


ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ కి రెస్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఆ ప్లేస్ లో సంజూ శాంసన్ ఆడనున్నాడు. ఇకపోతే బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి సూపర్ 8 కి సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే విరాట్ కొహ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Also Read: సూపర్ 8కి అమెరికా.. వర్షం కారణంగా ఐర్లాండ్ తో మ్యాచ్ రద్దు

న్యూయార్క్ పిచ్ కాబట్టి, తనకి అలవాటు కాకపోవడం, మళ్లీ కొత్తగా ఓపెనింగ్ చేయించడం లాంటి ప్రయోగాలు చేయడంతో అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఫ్లోరిడా పిచ్ పై బాగానే ఉంటుందని అంటున్నారు. అంతేకాదు వెస్టిండీస్ లో కూడా  స్లో పేస్, స్పిన్ పిచ్ లు కావడంతో విరాట్ కి ఇబ్బందులు ఉండకపోవచ్చునని అంటున్నారు. అలాగే రోహిత్ శర్మ కూడా తిరిగి టచ్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదో ఐర్లాండ్, కెనడా పై కాదు బలమైన జట్లపై సీనియర్లు ప్రతాపం చూపించాలని కోరుతున్నారు.

కెనడా విషయానికి వస్తే ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు ఓడింది. ఐర్లాండ్ పై గెలిచింది. ప్రస్తుతం ఇండియాతో అద్రష్టాన్ని పరీక్షించుకోనుంది.

Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×