E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Madhuri Cinema Entry: సినిమాల్లోకి మాధురి.. దువ్వాడ ఎన్టీఆర్ ఫ్యాన్, ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Madhuri Cinema Entry: సినిమాల్లోకి మాధురి.. దువ్వాడ ఎన్టీఆర్ ఫ్యాన్, ప్లానింగ్ మామూలుగా లేదుగా!
Advertisement

దువ్వాడ శ్రీనివాస్-మాధురి.. ఏ తెలుగు న్యూస్ ఛానెల్ చూసినా, యూట్యూబ్ ఛానెల్ చూసినా వీరిద్దరి సందడి అంతా ఇంతా కాదు. మాధురి ఎపిసోడ్ కి టాప్ రేటింగ్స్ రావడంతో అప్పట్నుంచి ఆమెను మీడియా నీడలా అనుసరిస్తోంది. మాధురిని ఆకాశానికెత్తేయడం, ఆమెను హీరోయిన్ లా ఉన్నారని అనడం, అందులోనూ నగ్మాతో పోల్చడం.. ఆమెతో క్యాట్ వాక్ చేయించడం, పాటలు పాడించడం, డ్యాన్స్ చేయించడం.. అబ్బో ఇలాంటి సీన్స్ ఇంటర్వ్యూల్లో చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఎంట్రీ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మాధురి.

టైమ్ వస్తే..
ఇప్పటికే మాధురికి చాలా క్వాలిఫికేషన్లు ఉన్నాయని పొలిటీషియన్, వుమన్ ఎంటర్ ప్రెన్యూర్, ఇన్ ఫ్లూయెన్సర్, ఫైర్ బ్రాండ్.. ఇలా చాలా ఉన్నాయని, సినిమా హీరోయిన్ కూడా అందులో యాడ్ అవుతోందని యాంకర్ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. మాధురి కూడా తనకు చిన్నప్పటినుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు. అంతే కాదు, గతంలో తనకు టైమ్ దొరకలేదని, ఛాన్స్ దొరకలేదని.. టైమ్ వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు మాధురి.

Advertisement

మాధురి గురించి దువ్వాడ..
మాధురి తనకు సినిమాల్లోకి వెళ్లాలనుంది అని అనగానే, పక్కనే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఊరుకుంటారా..? ఆయన కూడా మాధురి టాలెంట్ ని బయటపెట్టారు. పాటలు పాడటం కంటే కంటే ఆమె డ్యాన్స్ బాగా చేస్తుందని చెప్పుకొచ్చారు. భరతనాట్యంలో ఆమెకు ప్రవేశం ఉందన్నారు. నెమలికి నేర్పిన నడకలివీ అనే పాటతోపాటు, చాలా పాటలకు ఆమె అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తుందన్నారు. గతంలో దువ్వాడ కూడా మాధురిని అడిగి మరీ కొన్ని పాటలకు డ్యాన్స్ వేయించుకునేవారట.

మధ్యలో ఎన్టీఆర్..
దువ్వాడ శ్రీనివాస్ తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని, ఆయనే తనకు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆయన సినిమాల్ని తాను చూస్తుంటానని, హోమ్ థియేటర్లో ఆయన సినిమాలు చూస్తానన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు తాను థియేటర్లకు వెళ్తుంటానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా తాను అభిమానిస్తానని, అయితే తాను సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు దువ్వాడ. కార్ లో సీనియర్ ఎన్టీఆర్ పాటలు పెట్టుకుంటారని, అప్పుడప్పుడు ఆ పాటలకు అర్థాలు తనకు చెబుతుంటారని కోరస్ ఇచ్చారు మాధురి.

Advertisement

దువ్వాడ శ్రీనివాస్ కి కూడా సినిమాలంటే బాగా ఇష్టం. ఆమధ్య మాధురి నిర్మాతగా ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించినట్టు వార్తలొచ్చాయి. నటించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇక మాధురి కూడా తన యాక్టింగ్ పెర్ఫామెన్స్ ని వెండితెరపై చూపించాలనుకుంటున్నారు. ఫైనల్ గా వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందేమోనని అనిపిస్తోంది. దువ్వాడ-మాధురి కాంబినేషన్ ఇప్పటికే బుల్లితెరపై, యూట్యూబ్ లో సూపర్ హిట్ అయింది. వీరి ప్రోగ్రామ్ లకు మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఇక వీరు సినీరంగంలోకి వెళ్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. షార్ట్ ఫిల్మ్ ల వరకు ఓకే, వెండితెరపై కనపడాలంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని, దానికి దువ్వాడ సిద్ధపడతారా..? మాధురి తెరంగేట్రానికి తానే నిర్మాత అవుతారా..? వేచి చూడాలి.

Related News

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు

టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో సీఎం చంద్రబాబు యోగాసనాలు

Pawan Warning: పవన్‌కు హోంశాఖ? వైసీపీ గుండాలకు ఇక మూడేళ్లు ఇత్తడే, డోర్ డెలివరీ మాటేంటి?

కర్నూలు గడ్డ.. బంగారం అడ్డా.. దేశం చూపు ఇప్పుడు ఏపీ వైపే!

రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Weather Alert: విజయవాడ, గుంటూరు ప్రజలకు హై అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు..!

Sai Krishna: తప్పు చేసినోడు ఎంతటివాడైనా వదిలేదే లేదు.. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్!

దేశంలో తొలిసారి.. విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్టు, ఎయిర్ ట్రావెలర్ల కోసం ప్రత్యేకంగా లాంజ్‌లు

Big Stories

×