Horrible Accident: కర్ణాకటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు వివైడర్‌ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టింది. కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిత్రదుర్గ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. బెంగళూరు నుండి యాద్గిరి వైపు వెళ్తుండగా బొమ్మక్కనహళ్లి మజీదు ప్రాంతంలో కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ALSO READ: ప్రియుడి కోసం భర్తను చంపేసింది..!
ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలోనే మౌలా అబ్దుల్(35), అతని కొడుకులు రహ్మాన్(15), సమీర్(10) చనిపోయారు. అబ్దుల్ భార్య సలీమా బేగం(31), తల్లి ఫాతిమా(75) తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.