BigTV English

Telanagana News : జింకలు, నెమళ్లు.. గ్రాఫిక్స్, ఏఐ ఫోటోలతో గోల్‌మాల్.. HCU రాజకీయం

Telanagana News : జింకలు, నెమళ్లు.. గ్రాఫిక్స్, ఏఐ ఫోటోలతో గోల్‌మాల్.. HCU రాజకీయం

Telanagana News : సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో తెగ వైరల్ అవుతోంది. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏదో జరిగిపోతోందంటూ కొన్ని వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. రకరకాల క్లిపింగ్స్ కలిపేసి.. మంచి మ్యూజిక్, సినిమా డైలాగ్స్ యాడ్ చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషన్ వైడ్ ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. చూసింది చూసినట్టు గుడ్డిగా నమ్మేయకుండా.. కాస్త కామన్‌సెన్స్ అప్లై చేస్తే ఈజీగా అర్థమైపోతుంది అవన్నీ ఫేక్ అని. గ్రాఫిక్స్, ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ కంటెంట్‌ను జనాల్లోకి చొప్పిస్తున్నారు. డౌట్ ఉంటే ఆ వీడియోలు మరొకసారి ఫోకస్డ్‌గా చూడండి మీకే తెలిసిపోతుంది.


క్రియేటివిటీతో ఫేక్ పబ్లిసిటీ

వెనక బుల్డోజర్.. దాని ముందు జింకలు, నెమళ్లు పరుగులు పెడుతుంటాయి. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ కలర్ కాంబినేషన్, ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తేనే క్లారిటీ వచ్చేస్తుంది ఎవరో క్రియేట్ చేశారని. బుల్డోజర్ ముందే జింకల గుంపు ఉంటుందా? బుల్డోజర్ ముందే నెమళ్ల బృందం పురివిప్పి నాట్యం చేస్తుందా? అసలు నెమళ్లు ఎప్పుడు పురి విప్పుతాయో తెలుసా? భయం వేసినప్పుడో.. పారిపోయేటప్పుడో కాదు.. మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే నెమలి పురివిప్పుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా?


ఆ జింకలు వేరే.. ఈ నెమళ్లు వేరే..

కొన్ని వీడియోల్లో.. నైట్ మోడ్‌లో వరుసగా బుల్డోజర్లు లైట్లు వేసుకుని వెళ్తుంటాయి. వెంటనే ఆ ఫ్రేమ్ కట్ అయిపోయి.. జింకలు పరుగెత్తే విజువల్ వస్తుంది. ఆ తర్వాత నెమళ్లు పారిపోతుంటాయి. ఈ మూడు వేరు వేరు వీడియోలని ఇట్టే తెలిసిపోతుంది. ఎక్కడివో జింకల గుంపును తీసుకొచ్చి.. కంచ గచ్చిబౌలి బుల్డోజర్ల క్లిప్పింగ్‌కు లింక్ చేశారు. మరెక్కడో నెమళ్ల విజువల్స్‌ను కూడా ఆ వీడియోకు మిక్స్ చేశారు. ఇలా రకరకాల ఫుటేజ్‌ను కలిపేసి.. కన్ఫ్యూజ్ చేసే ఎత్తుగడ ఇదంతా. గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లు దిగిన మాట వాస్తవం. కానీ, ఆయా వీడియోల్లో చూపించిన జింకలు, నెమళ్లు అవాస్తవం. పూర్తిగా కల్పితం.

ఫీక్ వీడియోలతో చీప్ ప్రచారం?

ఇక.. పుష్ప, జనతా గ్యారేజ్ డైలాగులను ఆ వీడియోలకు వాడేసి.. ఏదో జరిగిపోతోంది.. ఏవో కొంపలు మునిగిపోతున్నాయి అనేలా ఫేక్ వీడియోస్, ఫోటోస్‌ను తెగ సర్క్యూలేట్ చేస్తున్నారు కొందరు. వాటి వెనుక బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయని అంటున్నారు.

Also Read : HCU చుట్టూ కేసీఆర్ భూదందా.. బయటపడిన బాగోతం

అసలు HCUకు ఏం సంబంధం?

ఇక్కడ మరో మెయిన్ లాజిక్ ఏంటంటే.. ఆ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేకపోవడం. కాకపోతే HCU పక్కనే ఉన్నాయి ఆ ల్యాండ్స్. అది కంప్లీట్‌గా గవర్నమెంట్ స్థలం. రికార్డులు ఉన్నాయి. సర్కారూ ఇదే చెబుతోంది. ఇందులో నో డౌట్స్. అయినా కూడా కావాలనే HCU భూములు అంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారు. ప్రతీ వీడియోలోనూ యూనివర్సిటీని చూపిస్తున్నారు. స్టూడెంట్స్ మాటలను యాడ్ చేస్తున్నారు. అసలు ఆ విద్యార్థులను బీజేపీయే రెచ్చగొడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. స్టూడెంట్స్‌ను ముందుంచి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని హస్తం పార్టీ మండిపడుతోంది. ఇదంతా పక్కా రాజకీయమని అంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా.. HCU భూముల్లోకి బుల్డోజర్లు దిగాయి. చెరువులు నాశనం అవుతాయి. జింకలు, నెమళ్లను చంపేస్తున్నారు.. అంటూ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో చీప్ పబ్లిసిటీ చేస్తున్నారంటూ ప్రభుత్వ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి వీడియోలు, ఫోటోలను నమ్మొద్దని కాంగ్రెస్ శ్రేణులు సూచిస్తున్నాయి.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×