BigTV English
Advertisement

Divvala Madhuri: దివ్వెల మాధురి ఆస్తులు కోట్లల్లోనే.. పాపం దువ్వాడ మాత్రం?

Divvala Madhuri: దివ్వెల మాధురి ఆస్తులు కోట్లల్లోనే.. పాపం దువ్వాడ మాత్రం?

Divvala Madhuri: అమ్మో బాబోయ్.. ఇవేమి ఆస్తులు.. ఈ లిస్ట్ చూస్తే ఔరా అనాల్సిందే. దాదాపు అంబానీ ఫ్యామిలీకి గట్టిపోటీనిచ్చే స్థాయి ఉన్నంత ఆస్తి ఉందట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు మనందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమె ఒక ట్రెండ్ ను సృష్టించింది. ఇంతకు ఈమె ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదు దివ్వెల మాధురి. ఈమె ఆస్తుల లిస్ట్ తెలుస్తే ఔరా అనాల్సిందే. ఇంతకు ఆస్తుల జాబితా ఏమిటో తెలుసుకుందాం.


ఈ జంట ఫేమస్..
ఏపీ టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకో తెలుసా.. వీరు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యారు. స్వయానా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లీడర్. దివ్వెల మాధురి మాత్రం మంచి నృత్యకారిణి. దువ్వాడ ఫ్యామిలీ వివాదం తెరపైకి వచ్చిన వెంటనే మాధురి ఎంటర్ అయ్యారు. ఇక ఆ సమయం నుండి ఈ జంట ఒక్కటై తిరుగుతున్నారు. తాము పెళ్ళికి రెడీ అంటూ చాలా సార్లు చెప్పకనే చెప్పారు.

మాధురి గిఫ్ట్ కొన్నారో.. లక్షలే
దివ్వెల మాధురి ఏదైనా గిఫ్ట్ కొంటే చాలు, ఆ గిఫ్ట్ వైరల్ కావాల్సిందే. దువ్వాడ శ్రీనివాస్ నా ప్రాణం అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చిన మాధురి లగ్జరీ లైఫ్ ను కొనసాగిస్తారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే సంధర్భంగా ఆమె ఇచ్చిన గిఫ్ట్ అలాంటిది ఇలాంటిది కాదు. లక్షల విలువ గల వాచ్ ను ఇచ్చిన సర్ ప్రైజ్ చేసింది మాధురి. ఏదిఏమైనా సోషల్ మీడియాలో ఈ జంట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం.


దువ్వాడ కు షాక్..
ఏపీలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని స్వయానా ఆయనే పలుమార్లు చెప్పారు. దీనితో ఇప్పుడు తనవద్ద ఎలాంటి ఆస్తి లేదని, వట్టి చేతులతో తాను ఉన్నట్లు, తనను దివ్వెల మాధురి ఆదుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇటీవల దువ్వాడ ను వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

దువ్వాడ జీరో.. మాధురి హీరో
దివ్వెల మాధురి కోటీశ్వరురాలే. ఈ మాట చెప్పింది కూడా మాధురినే. ప్రస్తుతం దువ్వాడ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని, మొత్తం తన భార్య వాణికి రాసి ఇచ్చారట, తనే దువ్వాడ కు అప్పు ఇచ్చి ఆదుకున్నట్లు బిగ్ టీవీ తో మాధురి చెప్పుకొచ్చారు. తాను గోల్డెన్ స్పూన్ తో పుట్టినట్లు, తనకు ఇతరులకు మోసం చేసి బ్రతకాల్సిన అవసరం లేదని మాధురి చెప్పడం విశేషం. ఆస్తుల విషయంలో దువ్వాడ జీరో అయితే మాధురి హీరో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: AP ITI Students: మీరు ఐటీఐ విద్యార్థినా? లేక అడ్మిషన్ పొందాలా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే..

మాధురి ఆస్తులు ఇవే
బిగ్ టీవీతో మాట్లాడిన దివ్వెల మాధురి తన ఆస్తుల చిట్టా మొత్తం చెప్పేశారు. శ్రీకాకుళం, వైజాగ్, టెక్కలిలో తనకు భారీగా ఆస్తులున్నట్లు మాధురి చెప్పారు. టెక్కలి లో ఓ పెట్రోల్ బంక్ తన పేరు మీద ఉందని, అలాగే వైజాగ్ స్కై పార్క్ గేటెడ్ కమ్యూనిటీలో రూ. 2 కోట్ల విలువ గల అపార్ట్ మెంట్, శ్రీకాకుళంలో 3 అంతస్తుల భవనం ఉందని చెప్పారు. అంతేకాకుండా తనకు డబ్బుకు కొదువ లేదని, తన తండ్రి రియల్ ఎస్టేట్ లో సంపాదించారని, తాను చిన్నప్పటి నుండే గోల్డెన్ స్పూన్ తో పుట్టినట్లు మాధురి తన ఆస్తులపై క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద మాధురి ఆస్తుల చిట్టా చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×