E-Paper
Advertisement

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు
Advertisement

Seediri Appalaraju Arrest: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అప్పలరాజు ఇంటికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చివరికి పోలీసులు సిదిరి అప్పలరాజు అరెస్టు చేసి.. స్టేషన్ కు తరలించారు.

అరెస్టు ఎందుకంటే?

ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ పై వెళ్తూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో దానయ్య అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. అయితే ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడికి బదులు సిద్ధార్థ త్యాడి అనే మరో యువకుడ్ని జైలుకు పంపేలా మాజీ మంత్రి కుట్ర చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

అరెస్టును అడ్డుకునే యత్నం

ఇదిలా ఉంటే సీదిరి అప్పలరాజును అరెస్టు చేయబోతున్నట్లు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక నేతలు కాశీబుగ్గలోని నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే సాయంత్రం పోలీసులు ఆయన నివాసానికి రాగా.. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అప్పలరాజు అరెస్టును కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా భారీ ఎత్తున సిబ్బందితో వచ్చిన పోలీసులు వారిని నిలువరించారు.

Advertisement

Also Read: ముందు నుయ్యి వెనుక గొయ్యి.. రాహుల్ ఎంట్రీతో కేంద్రానికి మ‌రింత జ‌ఠిలంగా ప్ర‌ధాన్ స‌మ‌స్య‌!

ముందస్తు బెయిల్ కోసం పిటిషన్

కాగా, అప్పలరాజును తీసుకెళ్తున్న క్రమంలో ఆయన భార్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లవద్దని వారించే ప్రయత్నం చేశారు. చివరికి అప్పలరాజు స్వయంగా వెళ్లి పోలీసు వాహనం ఎక్కడంతో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకోలేదు. అటు అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే సోంపేట అదనపు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం సీదిరి అప్పలరాజు పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణను గురువారానికి కోర్టు వాయిదా వేసింది.

Also Read: పాత వాహనాలు ఉన్నాయా? కేంద్రం అదిరిపోయే ఆఫర్లు.. చలానాలు, ట్యాక్స్ మాఫీ!

Related News

Hanuman Idol: ఏపీలో దేవుడికే రక్షణ లేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ యాంకర్ శ్యామల!

కాంగ్రెస్ ఆఫీసుపై రౌడీల్లా దాడి చేస్తారా? బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ షర్మిల!

YS Jagan: పొగాకు రైతులకు జగన్ భరోసా.. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన!

Pawan Kalyan: ఎల్ నినో భయాలకు చెక్! పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహం.. ఆ జిల్లాలకు పండగే!

48 ఏళ్లుగా బస్సే లేని గ్రామం.. ఎట్టకేలకు ఊర్లోకి ఎర్రబస్సు.. ఎక్కడో చూసేయండి!

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, కేవల ఐదు రోజులు మాత్రమే

ఢిల్లీలో సీఎం చంద్రబాబు, మోదీ-షాతో కీలక సమావేశం, వరుస పరిణామాలు, ఆ బాధ్యతలు అప్పగింత!

Big Stories

Advertisement
×