Big Stories

AP Ex Ministers : బూతుల నుంచి బెదిరింపులకు.. అధికారం కోల్పోయినా తీరు మార్చుకోని నేతలు

AP Ex Ministers : చింత చచ్చినా.. పులుపు చావలేదు అనే సామెత తెలుసు కదా. ఇది పర్‌ఫెక్ట్‌గా సూటవుతోంది ఏపీలోని వైసీపీ నేతలకు.. అధికారం అండ చూసుకొని అప్పుడు బూతు పురాణం వినిపించిన నేతలు.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. ఇప్పుడు బూతుల నుంచి మరో లెవల్‌కు వెళ్లి బెదిరింపుల వరకు వచ్చారు.

- Advertisement -

విన్నారుగా.. ఇంత పద్ధతిగా మాట్లాడింది వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఓ ఛానల్‌ డిబేట్‌లో పాల్గొన్న నాగార్జున.. తెలుగు రాష్ట్రాల సీఎంల గురించి మాట్లాడిన మాటలు ఇవి. ఇదీ ఆయన సభ్యత.. సంస్కారం. అందుకే మొదట మనం మాట్లాడుకుంది. సీట్ల సంఖ్య 151 నుంచి 11కు ఎందుకు తగ్గింది? అనే క్వశ్చన్‌కి వైసీపీ నేతలు ఇంకా ఆన్సర్ తెలుసుకోనట్టు కనబడుతోంది. వారి మాటల్లో అదే అహంకారం.. అదే దురుసుతనం.. ఆయన ఏం మాట్లాడారు అనే దానిపై కాదు ఇప్పుడు డిస్కషన్. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైనే ఇప్పుడు చర్చ.

- Advertisement -

కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరందరికి బూతు మంత్రులని ఓ బిరుదు ఉండేది. నోరు తెరిస్తే అచ్చ తెలుగులో మాట్లాడేవారు. టీవీల ముందు కూర్చున్న వారు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. అంతేనా ఏం ట్వీట్ చేస్తున్నారో తెలియదు. తిట్లు, బూతులు, శాపనార్థాలు.. ఇలా వీటిని ఓ బ్రాంగ్‌గా మార్చేశారు. నిజానికి విమర్శలు, ఆరోపణలు ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ఆ రేంజ్‌ను దాటేసి బూతే మంత్రం, బూతే లోకం అన్నట్టుగా దూసుకెళ్లారు వీళ్లంతా. ఇవన్నీ వినీ.. వినీ.. వీళ్లనా మనం గెలిపించిందని చింతించి.. చివరికి చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు. అయినా పరిస్థితులు ఏమైనా మారాయా? అంటే అదీ లేదు.

Also Read : జనసేనానికి మరో బంపరాఫర్ ఇచ్చిన చంద్రబాబు

అంబటి కావొచ్చు.. కొడాలి నాని కావొచ్చు.. మరేదైనా లీడర్ కావొచ్చు..ఇప్పటికీ అదే లైన్‌ను ఫాలో అవుతున్నారు. అంతే అశ్రద్ధగా, అంతే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపులే నాగార్జున యాదవ్‌ మాటలు.. నిత్యం తమ పార్టీ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసే నాగార్జున.. ఈసారి ఏకంగా తెలుగు రాష్ట్రాల సీఎంలనే టార్గెట్ చేసుకున్నారు. తిరుమలలో తప్పించుకున్నారని.. ఈసారి అలా తప్పించుకోలేరని చెబుతున్నారు. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా చాలా అనుచితంగా మాట్లాడారు.ఆ మాటలను మళ్లీ రీపిట్ చేయలేం. ఎందుకంటే మనకు కొంచెం సభ్యత, సంస్కారం ఉంది కాబట్టి.

నాగార్జున యాదవ్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది.నిజానికి ఎన్నికల ముందు ఏపీలో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉండేవి. రోజురోజుకూ ప్రజల కష్టాలు పెరుగుతున్నా.. వాటిని పట్టించుకుకోకుండా.. నేతల పర్సనల్ పంచాయితీతోనే పాలన నడిచింది. ఆఖరికి ప్రజలకు ఏదో ఒక మంచి పని చేసి ఎన్నికల్లో ఓట్లడగాలనే విషయాన్ని కూడా నేతలు మరిచారు. పక్క పార్టీని తిడితే చాలు ప్రజలు మళ్లీ పట్టం కడతారు అనుకున్నారు. అందుకే పాజిటివ్ ప్రచారం కంటే.. నెగటివ్ ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు.. బోల్తా పడ్డారు. మరి ఇప్పుడైనా బుద్ది తెచ్చుకొని ఏమైనా మారారా అంటే అదీ లేదు. ఇప్పటికీ అదే వితండవాదం.. దురంహకారం. ప్రజల్లో ఉండాల్సిన నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మాత్రం ఇలా డిబేట్స్‌కు వచ్చి అడ్డమైన వాగుడు వాగుతూ.. అంతో ఇంతో కొన ఊపిరితో ఉన్న పార్టీ ప్రాణాలను, పరువును రోడ్డుకు ఈడుస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News