MP Avinashreddy: రాజకీయాల్లో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఊహించలేము. బళ్లు.. ఓడలు అవుతాయి. ఓడలు బళ్లు అవుతాయి. ఇప్పుడున్న రాజకీయాల్లో ఏదీ ఊహించలేము కూడా. అలాంటి చిన్న సన్నివేశం చోటు చేసుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఆగష్టు 27న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఉన్నట్లుండి అవినాష్‌రెడ్డికి కేంద్రమంత్రి శుభాకాంక్షల వెనుక ఏం జరుగుతోంది? కావాలనే వైసీపీ నేతలు ఆ విధంగా చేయించారా? అన్న చర్చ అప్పుడే మొదలైంది.
గడిచిన రెండు పర్యాయాలు ఎంపీగా అవినాష్‌రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు కూడా. వారం కిందట వైసీపీ నేతలు పార్లమెంటు లాబీల్లో కేంద్రమంత్రి గడ్కరీని కలిశారని, ఆ సమయంలో వినాయక చవితి రోజు అవినాష్‌రెడ్డి పుట్టినరోజు విషయాన్ని ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో దాన్ని గుర్తుగా పెట్టుకుని కేంద్రమంత్రి శుభాకాంక్షలు చెప్పారని అంటున్నారు. అయినా శుభాకాంక్షలు చెప్పిన మాత్రాన బీజేపీ-వైసీపీ ఒక్కటయ్యాయని ఎలా చెబుతారన్నది టీడీపీ వైపు నుంచి బలంగా వినిపిస్తున్న ప్రశ్న. దీనివెనుక జగన్ ఏదో స్కెచ్ ఉంటుందని చెబుతున్నారు. గడ్కరీ ట్వీట్ చేశారంటే ఆశామాషీ కాదని అంటున్నారు.
ALSO READ: కుప్పానికి మహార్థశ.. ఐఫోన్ ఛాసిస్ తయారీ
రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని, శుభాకాంక్షలు చెప్పిన మాత్రాన ఏదో జరుగుతోందని చర్చించుకోవడం కరెక్టు కాదన్నది టీడీపీ నేతల మాట. రాజకీయాలు అనేవి పార్టీ పరంగా ఉంటాయని, మిగతా విషయాల్లో అలాంటిదేమీ లేదంటున్నారు. భూతద్దంలో చూడాల్సిన పనిలేదని అంటున్నారు. కాకపోతే బ్లూ మీడియా ఇదే విషయాన్ని పనిగట్టుకుని ఏదో జరుగుతోందంటూ రాసుకొస్తుందని అంటున్నారు.
మాజీమంత్రి వివేకానంద హత్య కేసు ఎంపీ అవినాష్‌రెడ్డిని వెంటాడుతోంది. కేంద్రం ఆశీస్సులతో ఆయన బయటపడినట్టేనని రాసుకొస్తున్నాయి. అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నారు సునీత. ఇలాంటి సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు కేంద్రమంత్రి చెప్పడం ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెప్పడానికే వైసీపీ ఈ స్కెచ్ వేసిందని అంటున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.
Birthday greetings to the Lok Sabha MP from Kadapa, Andhra Pradesh Shri Y S Avinash Reddy Ji.💐 May you be blessed with good health and long life.
— Nitin Gadkari (@nitin_gadkari) August 27, 2025