BigTV English

Operation Ravan: ఆపరేషన్‌ రావణ్‌ అదుర్స్ అంటున్న మాస్ కా దాస్‌

Operation Ravan: ఆపరేషన్‌ రావణ్‌ అదుర్స్ అంటున్న మాస్ కా దాస్‌

Operation Raavan movie update(Latest movies in tollywood): టాలీవుడ్‌లో చిన్న మూవీగా వచ్చి పెద్ధ సక్సెస్‌ని సాధించిన మూవీ పలాస. ఈ మూవీలో యాక్ట్ చేసి మంచి మార్కులు సంపాదించిన హీరో రక్షిత్‌ అట్లూరి.తాను యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ రావణ్.ఈ మూవీని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. ఈ మూవీలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆపరేషన్ రావణ్ మూవీ.ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది.గురువారం ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అతిథిగా హాజరై మూవీ టీమ్ సభ్యులకు కంగ్రాట్స్ చెప్పారు.అనంతరం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ చొల్లేటి మాట్లాడుతూ.. ఆపరేషన్ రావణ్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నేను వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.సినిమా బాగా వచ్చింది.మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.


లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ..మా ఆపరేషన్ రావణ్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి వచ్చిన హీరో విశ్వక్ సేన్ గారికి థ్యాంక్స్.ఆయన సినిమాలో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా అనే సూపర్ హిట్ సాంగ్ రాశాను.ఆ పాటకు అవకాశం ఇచ్చిన విశ్వక్ గారిని మర్చిపోలేను.ఆపరేషన్ రావణ్ సినిమాలో ఓ మంచి లవ్ మెలొడీ సాంగ్ రాసే అవకాశం దక్కింది.చందమామ కథలో అనే పాటకు మంచి లిరిక్స్ కుదిరాయి.హీరో రక్షిత్ ఈ మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశారు.ఆయనకు ఆపరేషన్ రావణ్ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానని పూర్ణాచారి అభినందనలు తెలిపారు.

Also Read:  ముచ్చటగా మూడోసారి, కానీ అక్కడ మాత్రం…


అనంతరం హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..ఆపరేషన్ రావణ్ మూవీ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందన్నారు.వెంకట సత్య ఏదో చేయాలని డైరెక్షన్ చేసినట్లు ఎక్కడా అనిపించలేదు.చాలా ప్యాషన్‌తో మూవీ చేశారని ట్రైలర్‌తో తెలుస్తోంది.ఈ సినిమా ఫంక్షన్ కు నన్ను ఇన్వైట్ చేయడానికి రక్షిత్ వచ్చినప్పుడు మా నాన్న డైరెక్ట్ చేశారని చెప్పారు.నేను కూడా మా నాన్నతో కలిసి మూవీస్ చేస్తుంటా.అలా నాకు రక్షిత్ రిలేట్ అయ్యాడు.వెంకట సత్యకి స్వీట్ మ్యాజిక్ పేరుతో ఏపీలో ఇక్కడా షాప్స్ ,రెస్టారెంట్స్ ఉన్నాయి.సెటిల్డ్ లైఫ్.కానీ వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసం పలాస చేశాడు.ఆ మూవీ డిస్కషన్స్ టైమ్ నాకు తెలుసు.ఆ మూవీకి మంచి పేరొచ్చింది.ఆపరేషన్ రావణ్‌తో మరోసారి రిస్క్ చేస్తున్నారు.ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా.రక్షిత్ కు నేను చెప్పే సలహా ఒక్కటే.ఇక్కడ లాస్ట్ ఛాన్స్ అనేది ఏమీ ఉండదు.ఇంకో ఛాన్స్ ఉంటుంది.మనం హోప్స్ వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. కాన్ఫిడెంట్ గా ట్రై చేయి తప్పకుండా సక్సెస్ వస్తుందన్నారు.

ఇక హీరోయిన్ సంగీర్త విపిన్ మాట్లాడుతూ ఆపరేషన్ రావణ్ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా.ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకట సత్య గారికి థ్యాంక్స్.అలాగే రక్షిత్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించేందుకు మా మూవీ టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు.ఆపరేషన్ రావణ్‌లో నేను టీవీ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తా.ఆ పాత్రలో నటించేప్పుడు టెన్షన్ పడ్డాను.ఆగస్టు 2న మా మూవీ థియేటర్స్‌లోకి వస్తోంది.మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.

Tags

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×