E-Paper
Advertisement

Gautam Gambhir : హెడ్ కోచ్ గంభీర్ పదవీ కాలం ఎంత ?

Gautam Gambhir : హెడ్ కోచ్ గంభీర్ పదవీ కాలం ఎంత ?
Advertisement

Gautam Gambhir : టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతంగంభీర్ పేరుని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. అందుకు అందరు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే గంభీర్ కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఛాప్టర్ ముగిసిపోయింది. ఇక జులై 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనకు గౌతంగంభీర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలు గంభీర్ ఎంతకాలం పదవిలో ఉంటాడనే అంశంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.

అదెప్పటివరకు అంటే డిసెంబర్ 2027వరకు గంభీర్ కోచ్ గా ఉంటాడు. అంటే మూడేళ్లు తన పదవీకాలం ఉంటుంది. అది కూడా వన్డే ప్రపంచకప్ 2027 వరకు తను కొనసాగుతాడు. ఇప్పుడు తన టార్గెట్ ఏమిటంటే, వచ్చే ప్రపంచకప్ నాటికి ఒక అద్భుతమైన టీమ్ ని తయారుచేయాల్సి ఉంటుంది.

Advertisement

25మందితో ఒక స్క్వాడ్ ని రెడీ చేయాలి. అలాగే మధ్యలో అంటే రెండేళ్ల తర్వాత 2026లో మరో టీ 20 ప్రపంచకప్ జరగనుంది. అందుకు ఒక టీమ్ ని సిద్ధం చేయాలి. నేడు జింబాబ్వేలో ఆడుతున్న కొందరు కుర్రాళ్ల ఆటకు పదును పెట్టాలి. వారి లోపాలను సరిచేయాలి. ఇవన్నీ ఒకెత్తు అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఇంకా టీమ్ ఇండియాకి అందని ద్రాక్షలాగే ఉంది. దానిని సాధించాలి.
ఆ బాధ్యత కూడా గంభీర్ పైనే ఉంది.

Also Read : బోనస్ లో తేడాలు వద్దు : రాహుల్ ద్రవిడ్

Advertisement

తనతో పాటు అంతే బాధ్యత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరిపైనా ఉంది. అంతేకాదు 33 ఏళ్ల మహ్మద్ షమీ, 35 ఏళ్ల రవీంద్ర జడేజా వీళ్లపై కూడా ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ను గెలిచి భారతదేశానికి మరో కానుక ఇవ్వాలని సీనియర్లు భావిస్తున్నారు. వీరందరినీ ఒక తాటిపై నడిపించాల్సిన బాధ్యత గంభీర్ పై ఉంది.

అందరూ ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు గౌతం గంభీర్ వేతనాన్ని బీసీసీఐ నిర్ధారించలేదనే వార్తలు వస్తున్నాయి. కేవలం తన సపోర్టింగ్ స్టాఫ్ వేతనాలపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి గంభీర్ డిమాండ్ పెద్ద సమస్య కాదని అంటున్నారు. శ్రీలంక టూర్ ప్రారంభం కావడానికి వారం రోజుల ముందు జట్టుతో సన్నాహక క్యాంప్ జరుగుతుంది. అక్కడే కొత్త కోచ్ జట్టు సభ్యులతో కలుస్తాడు. ఆ సమయానికి గౌతంగంభీర్ టీమ్ రెడీ కావాలి. అందుకనే ఈలోపే అందరి వేతనాలు నిర్ధారిస్తారని అంటున్నారు.

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×