E-Paper
Advertisement

Harshaveena Selfie Video: హనీ ట్రాప్ అని నిరూపిస్తే నన్ను చంపేయండి.. హర్షవీణ మరో సెల్ఫీ వీడియో

Harshaveena Selfie Video: హనీ ట్రాప్ అని నిరూపిస్తే నన్ను చంపేయండి.. హర్షవీణ మరో సెల్ఫీ వీడియో
Advertisement

Harshaveena Selfie Video: కడప జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ సోషల్ మీడియా వేదికగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ఎమ్మెల్యే అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. కేవలం వీడియోలు వైరల్ చేసినంత మాత్రాన ఎమ్మెల్యేకు శిక్ష పడుతుందని తాను భావించడం లేదని ఆమె పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కన్నెంపల్లి ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా చేస్తున్న వ్యాఖ్యలపై హర్షవీణ ఘాటుగా స్పందించారు. అరవ శ్రీధర్ ఏ రకంగా అమాయకుడో చెప్పాలని ఆమె నిలదీశారు. తప్పు చేసి దొరక్కుండా ఉండటమే అమాయకత్వం అని మీ భావనా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుకుంటే రోజుకో అమ్మాయితో ఉండే స్థాయి ఆయనది అంటూ పోస్టులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయ నేతలు ఎంతోమంది ఉన్నారని అందరూ అరవ శ్రీధర్ లాగా ఉండరని ఆమె స్పష్టం చేశారు. మీరు కూడా అలాగే ఉంటారు కాబట్టే ఇటువంటి పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాను ఎవరినీ మోసం చేయలేదని ఎమ్మెల్యేనే తనను మోసం చేసి మాట్లాడటం మానేశారని హర్షవీణ ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 7వ తేదీన శ్రీధర్ చివరిసారిగా తనతో మాట్లాడారని జనవరి 20 తర్వాతే తాను మీడియా ముందుకు వచ్చానని వెల్లడించారు. మోసం చేసింది ఎవరనేది అందరికీ తెలుసని ఎమ్మెల్యే వైఖరి వల్లే తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. హనీ ట్రాప్ చేయాలనుకుంటే ఏడాదిన్నర సమయం తనకు అవసరం లేదని వారిద్దరి మధ్య ఉన్న బంధానికి హనీ ట్రాప్ అని పేరు పెట్టడం సరికాదని హితవు పలికారు.

ఎమ్మెల్యే ప్రవర్తన ఎంత అసభ్యంగా ఉంటుందో చెప్పడానికి పలు ఉదాహరణలను ఆమె వీడియోలో ప్రస్తావించారు. విలువలు కలిగిన వ్యక్తి అయితే తన తల్లికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను తన వద్ద ఎందుకు ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా ముక్కా రూపానంద రెడ్డి కోడలి గురించి కూడా అసభ్యంగా మాట్లాడారని వెల్లడించారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళల పట్ల ఆయన ఎంత నీచంగా ప్రవర్తిస్తారో తనకు తెలుసని చెప్పారు. ఇటువంటి వ్యక్తి ఎలా అమాయకుడు అవుతాడో సమాజం ఆలోచించాలని కోరారు.

Advertisement

Read Also: Nurses Credit: నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపండి.. కల్వకుంట్ల కవిత ఫైర్!

Related News

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×