E-Paper
Advertisement

Balka Suman: మున్సిపల్ పీఠంపై ముదురుతున్న పోరు.. బాల్క సుమన్ అరెస్ట్

Balka Suman: మున్సిపల్ పీఠంపై ముదురుతున్న పోరు.. బాల్క సుమన్ అరెస్ట్
Advertisement

క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మందమర్రి సమీపంలోని ఈ మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటన ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఈ దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సుమన్ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి వివేక్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి.

పోలీసుల నిర్బంధంలో ఉన్న బాల్క సుమన్ మంత్రి వివేక్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి మంత్రి గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రౌడీయిజంతో కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను అధికార బలంతో అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బలబలాలను చూసి భయపడే కాంగ్రెస్ అక్రమ అరెస్టులకు తెరలేపిందని సుమన్ వ్యాఖ్యానించారు.

Advertisement

బాల్క సుమన్ ఆరోపణలపై మంత్రి వివేక్ వెంకటస్వామి అంతే ఘాటుగా స్పందించారు. సుమన్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. గతంలో చెన్నూరు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులను భయపెట్టి బలవంతంగా ఉపసంహరింపజేసిన చరిత్ర సుమన్‌ది అని విమర్శించారు. అప్పట్లో ఎన్నికలను ఏకపక్షంగా మార్చుకున్న సుమన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎన్నిక వాయిదా పడటానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిర్లక్ష్యమే కారణమని మంత్రి వివరించారు. నిర్ణీత సమయం కంటే ముందే తాము కౌన్సిల్ హాలుకు చేరుకున్నామని తెలిపారు. మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోవడంతో కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే సుమన్ కొత్త డ్రామాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు.

Advertisement

ప్రస్తుతం క్యాతన్‌పల్లిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అరెస్టులు, ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ పోరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ALSO READ: Congress Leaders: 2033 వరకు రేవంత్ పాలనే.. ఫాంహౌస్‌కే పరిమితమైతే ఓట్లు ఎలా వేస్తారు? బీఆర్ఎస్‌పై ఎంపీ చామల, యెన్నెం సెటైర్లు

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×