E-Paper
Advertisement

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్
Advertisement

Viral Video: సృష్టిలో తల్లి ప్రేమకు మించినది లేదు. పురాణాలు, ఇతిహాసాలు ఏది చదివినా తల్లి గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాసేపు తల్లి కనిపించకపోతే పిల్లలు అల్లాడుపోతారు. జంతువుల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. తల్లి నుంచి వాటి పిల్లలను వేరు చేసినప్పుడు కనీసం తిండి కూడా ముట్టుకోవడానికి ఇష్టపడవు. అంత విశ్వాసం జంతువులకు ఉంటాయి.

అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి దూడ ప్రయత్నం

పైన చిత్రంలో పాల రవాణా వాహనంపై ఆవు బొమ్మ కనిపించింది. అమ్మ అంటే ఆ మమకారం చెప్పలేము.. అస్సలు వర్ణించలేము. తల్లి అనగానే ఆమె ఒడితో ఒదిగిపోవాలని కోరుకుంటారు. అది మనుషులైనా, జంతువులైనా.  కానీ ఆ దూడకు  అర్థమైంది. తనకంటే ఎత్తులో ఉన్న అమ్మ ఒడిలో ఒదిగిపోవడం కష్టమని భావించింది. కనీసం పాలు తాగే ప్రయత్నం చేసింది. సమయం, సందర్భం, ప్రాంతం ఎక్కడన్నది కాసేపు పక్కన బెడితే.. ఇది తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన వీడియో వైరల్

Advertisement

పాల వాహనం వెనుక ఈ సన్నివేశాన్ని కారులో వెళ్తున్నవారు చూసి ఆగారు. ఆ దూడ తన తల్లి పాలు కోసం చేసిన ప్రయత్నాన్ని తన మొబైల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దూడ అమాయకపు చర్య చూసినవారు.. భావోద్వేగానికి గురయ్యారు. జంతువుల అమాయకత్వాన్ని, తల్లి ప్రేమ కోసం వాటి తపనను చూసిన వీక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు.

గోదావరి జిల్లాల్లో ఓ ఘటన వెనుక

ఉభయగోదావరి జిల్లాలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టుక తోటి అంగ వైకల్యంగా ఓ తల్లికి బాబు పుట్టాడు. ఆ బాబుకు వయస్సు రావడంతో సొంతంగా చిన్నషాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అంగవైకల్యంతో ఉన్న కొడుక్కి పెళ్లి చేసింది. వచ్చిన కోడలు కూడా అలాంటి సమస్య. కొద్దిరోజులకు ఆ తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. తల్లి లేని లోకంలో తాను ఉండలేనని భావించాడు కొడుకు. పగలు, రాత్రివేళ ఆ వ్యక్తికి తల్లి గుర్తుకు వచ్చేది. తాను చనిపోతే భార్య అనాథగా మారుతుందని భావించాడు ఆ వ్యక్తి. దీంతో భార్యభర్తలు ఇద్దరు తల్లి కోసం చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.

Advertisement

ALSO READ: బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

 

 

Related News

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×