AP DSP-2025: ఏపీలో జరిగిన మెగా డీఎస్సీ-2025 వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన బిగ్ టీవీ.. నిజాలు నిగ్గు తేల్చింది. స్కామ్ బట్టబయలు చేసినందుకు బిగ్‌టీవీ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఉలిక్కిపడిన ఏపీ సర్కార్, ఎస్జీటీ ప్రభాకర్‌పై విచారణకు ఆదేశాలు ఇచ్చింది?
ఆంధ్రప్రదేశ్ మెగా DSC-2025 వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై వైసీపీ పోరాటం చేస్తోంది. అంతా కరెక్టుగా చేశామని అధికారులు పదే పదే చెప్పుకొచ్చారు. తాజాగా భర్తీలో ఫేక్ EWS సర్టిఫికెట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. 2018 డీఎస్సీలో బీసీ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్న పలువురు విద్యార్థులు, గతేడాది జరిగిన మెగా డీఎస్సీలో ఈడబ్ల్యుఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వ్యవహారం కర్నూలు జిల్లాలో వెలుుగుచూసింది. ఈ వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చింది బిగ్ టీవీ.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ పాఠశాలలో స్పోర్ట్స్ కోటా కింద ఈడిగ ప్రభాకర్ ఎస్‌జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించడం రావడంతో బిగ్ టీవీలో రంగంలోకి దిగింది. చాలామంది డీఎస్సీ బాధితులు బిగ్ టీవీతో తమ గోడు వెల్లబోసుకున్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తును ప్రారంభించినట్లు విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటనలో తెలిపారు. అవకతవకలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు కర్నూలు డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!
ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి విచారణను ప్రారంభించి సంబంధిత రికార్డులు వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించుకున్నట్లు ఆ శాఖ పేర్కొంది. విచారణ పూర్తి కాగానే రిక్రూట్‌మెంట్- సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది విద్యాశాఖ. ఇంతవరకు బాగానే ఉంది. మెగా DSC-2025 నియామక ప్రక్రియలో పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక చేశామని చెబుతున్న అధికారులు, బిగ్ టీవీ కథనాలపై ఎందుకు విచారణకు ఆదేశించారు అన్నది అసలు ప్రశ్న. దీంతో డీఎస్సీ అభ్యర్థులు మీడియా ముందుకు వస్తున్నారు. ప్రభాకర్ వ్యవహారంలో నిజం తేలితే ప్రభుత్వం ఏం చెబుతుంది?
DSC స్కాం ఎఫెక్ట్ .. బిగ్ టీవీ అకౌంట్ బ్లాక్ | AP DSC Scam 2026|BIG TV Instagram Account Blocked#bigtvtelugu #apdscscam pic.twitter.com/YVu1FwrsLi
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2026