Eshwar Sai:ప్రమీల ఓ ప్రమీల ,రాతిరి రాతిరి రాతిరిలో, బాసింగ బలాలే అంటూ ఆల్బమ్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మాధురి రాథోడ్ (Madhuri Rathod), ఈశ్వర్ సాయి (Eshwar Sai). ముఖ్యంగా తమ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో, ఫోక్ సాంగ్స్ తో మంచి పాపులారిటీ అందుకున్న ఈ జంట.. అనూహ్యంగా ఏకాంతంగా గదిలో ఈశ్వర్ సాయి భార్యకి పట్టు పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత వారం రోజులుగా ఎక్కడ చూసినా ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈశ్వర్ సాయి భార్య శరణ్య(Saranya ) ఎన్నో తెలియని విషయాలను, ఆడియో రికార్డింగ్లను బయట పెట్టడమే కాకుండా.. ఈ విషయంపై మాధురి రాథోడ్ తల్లిని శరణ్య అడిగితే.. ఆమె రియాక్షన్ ఏంటి ? అనే విషయంపై కూడా శరణ్య మాట్లాడింది.
ఇకపోతే వారం రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ వివాదం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అటు ఈ విషయంపై మాధురి రాథోడ్ నేరుగా మీడియా ముందుకు వచ్చి స్పందించలేదు . కానీ ఈశ్వర్ సాయి మాత్రం వీడియోలు మీద వీడియోలు విడుదల చేస్తూ.. అటు మాధురి రాథోడ్ కు క్షమాపణలు చెప్పాడు. అయితే ఇంత జరుగుతున్నా మాధురి రాథోడ్ తల్లిదండ్రులు ఎందుకు స్పందించడం లేదు? అసలు ఆమె తరుపు వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై మాధురి రాథోడ్ తల్లి స్పందించింది అంటూ శరణ్య చేసిన కామెంట్లు ఆశ్చర్యంగా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శరణ్య మాట్లాడుతూ.. మాధురి తల్లి తన కూతురు మాధురి రాథోడ్ గురించి మాట్లాడుతూ “మా అమ్మాయి అంతే” అని చెప్పారు. ఈ ఒక్క మాట నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది” అంటూ శరణ్య తెలిపింది.
ఇదే ఇంటర్వ్యూలో మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ల మధ్య లీకైన ఆడియో కాల్ ను బయటపెట్టి ఈ విధంగా స్పందించింది. ఈ వివాదం జరిగిన తర్వాత నా భర్త ఇంటికి వచ్చాడు. అయితే ఒక రోజు ఇంట్లో ఉన్న సమయంలో కుటుంబ కలహాల కారణంగా కొద్ది రోజులు మళ్లీ బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో మాధురితో ఈ సంభాషణ జరిగింది.”నువ్వు పెళ్లి చేసుకోనవసరం లేదు. మన ఇద్దరం కలిసి సంపాదించుకుందాం.. సమాజాన్ని, శరణ్యను నేను చూసుకుంటాను” అని ఈశ్వర్ సాయి మాధురితో చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది అంటూ శరణ్య తెలిపింది.
also read:సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!
అయితే ఈ ఆడియోను తనకు వేరే వ్యక్తులు పంపించారని కూడా తెలిపింది శరణ్య. మరి శరణ్య చెప్పిన మాటలను బట్టి చూస్తే నిజంగానే మాధురి తల్లిదండ్రులు అలా చెప్పారా? మాధురిని తన తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదా? అసలు మాధురి కరెక్టా? లేక శరణ్య చెబుతోంది నిజమేనా? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తన వద్ద ఎన్నో కాల్ లిస్ట్, రికార్డింగ్ లు ఉన్నాయని, మీడియా కోరితే వాటిని బయటపెడతానని కూడా ఆమె చెప్పుకొచ్చింది.