E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
Advertisement

IMD Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. శుక్రవారం నుంచి సోమవారం వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, ఖమ్మంతోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

దక్షిణ భారత్‌లో చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. గడిచిన రెండువారాలుగా ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాతావరణ శాఖ ప్రకటనతో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎండలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.

రానున్న ఐదు రోజులు ఏపీ-తెలంగాణకు భారీ వర్ష సూచన

Advertisement

ఈశాన్య రుతుపవనాల కారణంగా రాబోయే ఐదు రోజులుపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.ఓ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. వర్షం పడే సమయంలో ఉరుములు మెరుపులతోపాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం అంచనా వేసింది. గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

వాతావరణ శాఖ వివరాల మేరకు.. మన్నార్ గల్ఫ్ నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ఈశాన్య రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Advertisement

ఏపీలోని ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప ప్రాంతాలు ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం తెలిపింది.

ALSO READ: వేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. కూటమి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, ఫస్ట్ లిస్టులో ఎవరెవరంటే..

ఈశాన్య రుతుపవనాల కారణంగా గురువారం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. శుక్రవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు కూడా ఆ హెచ్చరిక జారీ చేసింది. వర్షాల సమయంలో ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Related News

వేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. కూటమి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, ఫస్ట్ లిస్టులో ఎవరెవరంటే..

కూటమి మధ్య తేలిన సీట్ల పంచాయితీ.. టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పంపకాలు పూర్తి, ఎవరెవరు ఏ స్థానాలంటే..

చూడటానికి సాధారణ ఇల్లాలు.. కట్ చేస్తే 14 కేసులు ఉన్న లేడీ విలన్.. ఎవరో తెలుసా?

ప్లాస్టిక్, చైనా బొమ్మలు చెక్.. అమరావతి యువకుడి అద్భుత ప్రయోగం?

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ టికెట్ ఎవరికి?.. రేసులో ఉన్న టాప్ నేతలు వీరే!

ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విచిత్రం.. ఒకే గ్రామం నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నిక!

సీజేపీ నేతల అరెస్టును ఖండిస్తూ.. ఎక్స్‌లో వైఎస్ జగన్ సంచలన ట్వీట్..?

Big Stories

Advertisement
×