Yuzvendra Chahal On 15th Floor Balcony Incident: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 2013 ఐపీఎల్ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నారు. 2013 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున తాను ఆడినప్పుడు ఇద్దరూ క్రికెటర్లు తనను 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. బెంగళూరు జట్టుపై మ్యాచ్ గెలిచిన తర్వాత తామందరూ హోటల్ లో పార్టీ చేసుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాగిన మత్తులో తనను బాల్కనీ నుంచి ఇద్దరు ముంబై ఇండియన్స్ క్రికెటర్లు కిందకు వేలాడదీశారని వెల్లడించారు.
ఆ సమయంలో ఓ ఆటగాడి మెడను గట్టిగా పట్టుకోవడం వల్ల తాను బతికి బయటపడ్డానని టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వ్యా ఖ్యానించారు. లేదంటే 15వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయే వాడినంటూ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అతని మెడ పట్టుకోగానే ఆ గదిలో ఉన్న మిగిలిన ఆటగాళ్లు వెంటనే తనను పైకి లిఫ్ట్ చేసి, కాపాడినట్టు పేర్కొన్నారు. అయితే, చాహల్ ను కిందకు వేలాడదీసింది ఆండ్రూ సైమండ్స్, జేమ్స్ ఫ్రాంక్లిన్ అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇందులో ఆండ్రూ సైమండ్స్ దే కీలక పాత్ర అంటుంటారు. అతడే పీకలదాకా తాగి, ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. కానీ ఆ ఇద్దరి పేరు మాత్రం చాహల్ బయటకు చెప్పలేదు. వాళ్లను బ్లేమ్ చేయకుండా గొప్ప మనసు చాటుకున్నాడు. కాగా 2011 నుంచి 2013 వరకు ముంబై ఇండియన్స్ తరఫున యుజ్వేంద్ర చాహల్ ప్రాతినిధ్యం వహించాడు.
2011 లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచిందని యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు. ఈ క్రమంలో చెన్నై హోటల్ లో తాము పార్టీ చేసుకుందామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆండ్రూ సైమండ్స్ తో పాటు జేమ్స్ ఫ్రాంక్లిన్ ఇద్దరు తనను చాలా టార్చర్ పెట్టారు అని వ్యాఖ్యానించారు. చేతులు కాళ్లు కట్టేసి… నోటికి ప్లాస్టర్ వేశారని ఫైర్ అయ్యారు. రాత్రంతా గదిలోనే వదిలేసి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు ఉదయం క్లీనింగ్ స్టాప్ వచ్చి తనను విడిపించారని గుర్తు చేశారు. ఇలా తాగిన మైకంలో ఇద్దరు అత్యంత దారుణంగా తనతో ప్రవర్తించారని మండిపడ్డారు. ఆ తర్వాత తాము అందరం సరదాగానే ఉన్నామని యుజ్వేంద్ర చాహల్ గుర్తు చేశారు. అటు తన విడాకులపై కూడా యుజ్వేంద్ర చాహల్ షాకింగ్ నిజాలను పంచుకున్నారు. విడాకుల తర్వాత తాగుడుకు బానిస అయ్యానని బాంబ్ పేల్చారు.