YCP First List: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల సందడి మొదలు కావడంతో వైసీపీ ఓ అడుగు ముందుకేసింది. మేయర్, మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. జాబితా రావడంతో అభ్యర్థులు తమ తమ నామినేషన్లు వేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నామినేషన్లు మొదలయ్యాయి. అభ్యర్థుల ప్రకటన విషయంలో కూటమి కంటే వైసీపీ ఓ అడుగు ముందుకేసింది. తొలి విడతగా మేయర్, మున్సిపాలిటీలకు సంబంధించి ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 7 కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. విజయవాడ నుంచి మాజీ మేయర్ రాయన భాగ్మలక్ష్మి, తిరుపతి నుంచి శిరీషలకు మళ్లీ అవకాశం కల్పించింది.
20 మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1.ఇచ్చాపురం- రాజ్యలక్ష్మి
2.పలాస- తలసు శ్రీపద్మ
3.నర్సీపట్నం- చింతకాయల అనిత
4.యలమంచిలి- బి.తులసి
5.తుని- పిట్ల రామతులసి
6.కొవ్వూరు- మన్నె పద్మ
7.రామచంద్రాపురం- నాగేశ్వరరావు
8.కొండపల్లి- నల్లమోతు తేజస్వీ
9.తెనాలి-మద్దాలి శేషాచలం
10.చీరాల-డాక్టర్ ఇస్తార్ల శెర్లి
11.మదనపల్లె-జింక చలపతి
12.బద్వేల్- రాచపూడి వెంకట సాయి కృష్ణ
13.ప్రొద్దుటూరు- పొర్రెడ్డి నరసింహారెడ్డి
14.పులివెందుల- వైఎస్ ప్రమీలమ్మ
15.నగర పంచాయతీ అభ్యర్థులు
16.ఏలేశ్వరం- జి ఆశాలత
17. ఏలేశ్వరం నగర పంచాయితీ నుంచి ఆశాలత
18. ఉయ్యూరు- పైడిముక్కల దివ్య
19.గురజాల-పోలు వీరారెడ్డి
20.కనిగిరి- పులి శాంతిరెడ్డి
21.బుచ్చిరెడ్డి పాలెం- షేక్ షకీలా బేగం
22.కమలాపురం- ఎం కవిత
ALSO READ: కూటమి మధ్య తేలిక సీట్ల పంచాయితీ.. టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పంపకాలు పూర్తి, ఎవరెవరు ఏ స్థానాలంటే..
https:/twitter.com/YSRCParty/status/2110762168258011591?