E-Paper
Advertisement

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్తై చేశారంటూ మండిపాటు

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్తై చేశారంటూ మండిపాటు
Advertisement

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. రాయలసీమలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ అధినేత జగన్, ఆదివారం మీడియా ముందుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ చూడని పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని ఆరోపించారు. వెన్నుపోటు నాయకుడు, గొడ్డళ్లు సప్లై చేసే నాయకుడిగా చంద్రబాబును వర్ణించారు.

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు

చంద్రబాబు అధర్మ, రక్త చరిత్ర రాస్తున్నారని దుయ్యబట్టారు. తన పార్టనర్ పార్టీలోకి తన పార్టీ నుంచి నేతలను పంపించి పోటీ చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అప్పటికీ చంద్రబాబుకు ధైర్యం చాలలేదన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాసుర చరిత్ర రాస్తున్నారని మండిపడ్డారు.అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అంటూ జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ఫెయిర్‌గా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. పోలీసులు అక్కడే ఉన్నా, అడ్డుకోవడం లేదన్నారు. ప్రస్తుతం నామినేషన్లు వేసే పరిస్థితి లేదన్నారు.

గొడ్డళ్లు సప్తై చేశారంటూ జగన్ మండిపాటు

Advertisement

పోలీసులతో కేసులు పెట్టించి మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారని ఆరోపించారు. వాళ్లకు కావాల్సిన చోట్ల రిజర్వేషన్లు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. సర్‌లో 44 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. తుది జాబితా రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించారని అన్నారు. డీఐజీ మొదలు సీఐ వరకు సిండికేట్ మాఫియా తయారు చేశారని రుసరుసలాడారు. మాజీ ఐఏఎస్ అనిల్ చంద్రపునేఠా రిటైర్ అయ్యాక మళ్లీ ఆయన్ని ఎస్ఈసీగా నియమించారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై మీడియా ముందుకు జగన్

వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు ఎస్ఈసీ నిమ్మగడ్డకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను మార్చారని, అయినా 98 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్నామని గుర్తు చేశారు. శనివారం సాక్షి పేపరు రాసిన విషయాలను మీడియా ముందు చెప్పారు మాజీ సీఎం. ఈసీ నిబంధనల ప్రకారం వైసీపీ నేతలు నలుగురు వెళ్లినా పోలీసులు అంగీకరించలేదని, కష్టపడి వెళ్తే టీడీపీ నేతలు మా వాళ్లపై దాడులు చేసి నామినేషన్ పత్రాలను లాక్కున్నా పోలీసులు ఏమీ చేయలేదని, సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ లెక్కన రాష్ట్రంలో రాజ్యాంగం ఉన్నట్టా? లేనట్టా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.

Advertisement

ALSO READ: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

తొలిరోజు నామినేషన్ సందర్భంగా కేవలం నలుగురితో ఎంపీ మిధున్‌రెడ్డి వెళ్లారన్నది జగన్ మాట. ఇంతకీ కాన్వాయ్‌తో వెళ్లింది ఎవరు? ఎంపీ, ఆయన అనుచరులు కాదా? అనేది ప్రస్తావించలేదు. కళ్ల ముందు వాస్తవాలు కనిపిస్తున్నా, ఇంకా అబద్దం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత. ఎంపీ మిథున్‌రెడ్డికి తన మాదిరిగా తాగే అలవాటు లేదని క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంపీ వాహనంలో మందు బాటిళ్లు పెట్టిందెవరు? అనేది సమాధానం చెప్పలేదు.

Related News

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×