Fakhar Zaman On 2027 ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్ పై పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (Fakhar Zaman On 2027 ODI World Cup) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే వరల్డ్ కప్ లో కచ్చితంగా పాకిస్తాన్ ఛాంపియన్ అవుతుందని వెల్లడించారు. ఐసీసీ ట్రోఫీ గెలవాలని పాకిస్తాన్ ప్లేయర్లు అందరిపైన తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్టు గుర్తు చేశారు. ఈ క్రమంలో అందరం 2027 వన్డే వరల్డ్ కప్ పైన ఫోకస్ చేసినట్టు తెలిపారు.
వచ్చే ఏడాదిలో కచ్చితంగా పాకిస్తాన్ కు ట్రోఫీ అందిస్తానని… లేకపోతే తల నరుక్కుంటానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఫఖర్ జమాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. జన్మలో కూడా మీరు వరల్డ్ కప్ గెలవలేరని హేళన చేస్తూ సెటైర్లు పెంచుతున్నారు. టైటిల్ గెలవలేని క్రమంలో ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీలాగా దొంగిలించే ప్రయత్నం కూడా చేయవచ్చు అంటూ చురకలు అంటిస్తున్నారు. పాకిస్తాన్ వాళ్లకు దొంగిలించడం అలవాటేనని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఐసీసీ ట్రోఫీ సాధించాలనే ఒత్తిడి పాకిస్తాన్ ప్లేయర్లపై తీవ్రంగా ఉందని ఫఖర్ జమాన్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా గడ్డపై జరగనున్న 2027 టోర్నమెంటు నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల కళ నెరవేర్చుతామని శపథం చేశారు. దేశం సుదీర్ఘ నిరీక్షణను ఎలా ముగించాలనే దానిపై జట్టులో ప్లేయర్లంతా లోతుగా చర్చించుకున్నామని ఫఖర్ జమాన్ పేర్కొన్నారు. 2007లో టీమిండియా పై ఛాంపియన్ ట్రోఫీ తాము గెలిచామని… ఈ ట్రోఫీ గెలిచి దాదాపు 9 సంవత్సరాలు అయిపోయిందని వివరించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా ముద్దాడ లేదని పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (Fakhar Zaman) వ్యాఖ్యానించారు. ఇన్ని రోజుల పాటు టైటిల్ గెలవకపోవడంతో పాకిస్తాన్ అభిమానులు నిరాశ చెందుతున్నారని.. ఈ విషయం తమకు అర్థమైందన్నారు. కానీ వచ్చే వరల్డ్ కప్ లో మాత్రం కచ్చితంగా రాణిస్తామని తెలిపారు. ఆ దిశగా తాము సన్నాహాలు మొదలు పెట్టామని.. ఇందులో భాగంగానే లంక, ఇంగ్లాండ్ తో వన్డే ట్రై సిరీస్ కూడా ఆడుతున్నామని స్పష్టం చేశారు.
అయితే ఫఖర్ జమాన్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియన్ ఫాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య కనీసం మూడు మ్యాచ్ లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకనుందని అంటున్నారు.