E-Paper
Advertisement

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్
Advertisement

Peddireddy: నామినేషన్లు ప్రారంభమైన నుంచి జరుగుతున్న పరిణామాలతో వైసీపీ కేడర్ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? ఆ పార్టీ నేతలను బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారా? ఈ పరిణామాలతో పార్టీ ఓడిపోతుందని వైసీపీ డిసైడ్ అయ్యిందా? అందుకే పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి వైసీపీ డ్రాప్ అవుతుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు చివరి రోజు జోరందుకున్నాయి. దాన్ని అన్ని పార్టీల అభ్యర్థులు తమతమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాకపోతే రాయలసీమ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నామినేషన్ల పేరుతో కీలక నేతలు బయటకు వచ్చి కేడర్ రెచ్చిగొట్టడంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కీలక నేతలను గృహ నిర్భందం చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై వైసీపీ రియాక్ట్ అయ్యింది.

పోటీకి దూరమంటూ వైసీపీ పెద్దిరెడ్డి ప్రకటన

Advertisement

తాజాగా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు వైసీపీ సీనియర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇన్ని దౌర్జన్యాలు చేస్తే ఎలా పోటీ చేయాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. పుంగనూరు, రాయచోటి, రాజంపేట, పుంగనూరు, పులివెందుల స్థానలను వైసీపీ గెలుచుకుంటుందని, టీడీపీ సర్వేలోనూ అదే తేలిందన్నారు. మేం గెలుస్తామని భావించిన చోట్ల పోలీసులను ముందు పెట్టి గలాటాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కసారిగా షాకైన కేడర్

దీని వెనుక సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రధాన కారణమని తేల్చేశారు. జరుగుతున్న పరిణామాలను ఖండిస్తున్నామని, ప్రజలు చూస్తున్నారని అన్నారు. తప్పకుండా తగిన సమయంలో ఈ కూటమి పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కూటమి నేతల ఆరోపణలకు భయపడేది లేదన్నారు. చదువుకున్న నుంచి ఇప్పటివరకు చంద్రబాబుతో వైరంతో కొనసాగుతోందన్నారు. రేపటి రోజున అదే విధంగా పోరాటం చేస్తామని, రాజీపడేది లేదన్నారు. వచ్చే జనరల్ ఎన్నికల వరకు తాము పోరాటం చేస్తామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. ప్రజలు ఇచ్చే తీర్పు బట్టి నుంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. తమను ఇంటి నుంచి బయటకు రానివ్వలేదన్నారు. అలాంటప్పుడు నామినేషన్ ఎలా వేస్తామని ఎదురు ప్రశ్నించారు.

Advertisement

ALSO READ: సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు,

పుంగనూరు పట్టణానికి రావద్దంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నామినేషన్ల మొదటి రోజు జరిగిన ఘర్షణలతో పుంగనూరులో పరిస్థితి ఇంకా సున్నితంగా ఉందని పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 168 కింద పుంగనూరు అర్బన్ సీఐ ఈ నోటీసు ఇచ్చారు. పుంగనూరులో జనసమీకరణ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్తై చేశారంటూ మండిపాటు

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×