BigTV English

KA Paul: పవన్.. నోరు మూసుకో.. ఆ 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ ఏదీ? : కేఏ పాల్

KA Paul: పవన్.. నోరు మూసుకో.. ఆ 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ ఏదీ? : కేఏ పాల్

KA Paul Comments on Pawan kalyan: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారు. పవన్ కల్యాణ్ దీక్షపై కేఏ పాల్ స్పందించారు. ఎందుకోసం మీరు దీక్ష చేస్తున్నారు పవన్ కల్యాణ్ అంటూ ఆయనను ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ కాంట్రవర్సీని కావాలనే పెద్దదిగా చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మీరెందుకు దీక్ష చేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. మరి మీరు స్టీల్ ఫ్లాంట్ ను సీక్రెట్ గా ఎందుకు అమ్మేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నాకు ఈరోజు తెలిసింది. రూ. 8 లక్షల కోట్ల స్టీల్ ఫ్లాంట్ ను కాపాడుతానంటూ నాడు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడారు కదా.? ఇప్పుడెందుకు స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడటంలేదు?


Also Read: కేఏ పాల్ అసలు పేరు ఇదేనట.. ‘అప్పట్లో మా నాన్న నన్ను తిరుపతి తీసుకెళ్లి…’

అదేవిధంగా ఏపీలో 30 వేల మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోయారని, వాళ్ల ఆచూకీ ఇంకా తెలియడంలేదని.. మీరు అధికారంలోకి వస్తే ఫైట్ చేస్తానంటూ నాడు పేర్కొన్న పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటంలేదు. పవన్ కల్యాణ్ ముందు నువ్వు.. తప్పిపోయిన 3o వేల మంది అమ్మాయిల ఆచూకీ తెలియాలంటూ దీక్ష చెయ్.. లేదా నోరుమూసుకుని మౌనవ్రతం పాటించు. ఎవరు ఏదిపడితే అది రాసినచ్చిన ఆ స్క్రిప్ట్ ను చదవొద్దు తమ్ముడూ. నేను ఒక గ్లోబల్ ప్రెసిడెంట్ గా.. నీకన్న వయస్సులో పెద్ద వ్యక్తిగా.. స్పీరిచువల్ లీడర్ గా నేను నీకు సలహా ఇస్తున్నాను. నా సలహాను పాటిస్తే నువ్వు చరిత్ర హీనుడిగా ఉండవ్.. చరిత్ర హీరోగా మిగులుతావు. ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించు.. లేదా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి చక్కగా సినిమాల్లోకి వెళ్లు. నీకు ఉపయోగముంటది.. మంచి పేరు వస్తది.


ఏపీకి ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తున్నాను.. రండీ ఢిల్లీ వెళ్లి కొట్లాడుదామంటే మీరెవరూ స్పందించరేందీ పవన్ కల్యాణ్.? ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక హోదా మీకు వద్దా? తిరుపతిని యూనియన్ టెర్రీటరీగా చేయాలని కేంద్ర పెద్దలతో ఇప్పుడే మాట్లాడా. ఈ విషయమై త్వరలోనే ప్రధానిని కలువబోతున్నా. అర్థం చేసుకో తమ్ముడూ శాంతిని నెలకొలుపుదాం.. యుద్ధాలు వద్దు తమ్ముడూ. అసలు ఇంతకు మీరిచ్చిన హామీలు అమలు చేయడంలో ఫేయిలైనందుకా..? ఈ లడ్డూ వివాదం?

Also Read: రోజాకు అసలు విలువలు లేవు, అలా డబ్బులు సంపాదించుకుంటుంది.. కిర్రాక్ ఆర్పీ వ్యాఖ్యలు

లేదా స్టీల్ ఫ్లాంట్ ను సీక్రెట్ గా అమ్మేసేందుకా ఈ లడ్డూ కాంట్రవర్సీ.?. ప్రత్యేక హోదాపై మీరెందుకు మాట్లాడటంలేదు. నేను ఇన్నిరోజుల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాను. కానీ, మీరెవరూ ఈ విషయంపై ఏం మాట్లాడటంలేదు. ప్రత్యేక హోదా వస్తే ఏపీలోని 6 కోట్ల ప్రజల కష్టాలు తీరుతాయి. రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. గుర్తుపెట్టుకోండి.. మిమ్మల్ని హెచ్చరిస్తున్నా.. ఈ విధంగా వ్యవహరిస్తున్న మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలబోనూ. రేపు మీరు తిరుపతి యూనియన్ టెర్రీటరీకి సంబంధించిన న్యూస్ వినబోతున్నారు’ అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×