E-Paper
Advertisement

బాలికలకు ముఖ్య గమనిక.. కేజీబీవీ అడ్మిషన్లు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే

బాలికలకు ముఖ్య గమనిక.. కేజీబీవీ అడ్మిషన్లు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే
Advertisement

KGBV Admissions 2026: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో KGBV అడ్మిషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. వీటికి సంబంధించి ఖాళీగా ఉన్న విద్యాలయాల్లో సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తుల గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలికలకు ముఖ్య గమనిక.. కేజీబీవీ అడ్మిషన్లు గడువు పొడిగింపు

Advertisement

ఆంధ్రప్రదేశ వ్యాప్తంగా 352 విద్యాలయాలు ఉన్నాయి. 2026-27 ఏడాదికి 6 నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్ల దరఖాస్తు ప్రక్రియ జోరుగా సాగుతోంది. దీనికితోడు ఏడు నుంచి పది వరకు తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు పొడిగించింది.

ఈ విషయాన్ని ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. నార్మల్‌గా అయితే అడ్మిషన్ల దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ఒకటితో ముగియనుంది. బాలికల తల్లిదండ్రుల అభ్యర్థనల మేరకు గడువు తేదీని పొడిగించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వర్గాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అర్హులు.

Advertisement

విద్యార్థినుల తల్లిదండ్రులకు సూచన.. చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు మాత్రమే

అయితే ప్రవేశాల దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తులను https://apkgbv.apcfss.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి. ఎంపికైన విద్యార్థులకు దరఖాస్తులో నమోదు చేసిన ఫోన్‌కి మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తారు. దీనికితోడు ఎంపికైన విద్యార్థుల జాబితాను సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులో చూడవచ్చు.

దరఖాస్తులకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలోపు తల్లిదండ్రులు ఈ నెంబర్ల 7993329115, 7075039990కు ఫోన్ చేసి అధికారులతో మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఆరు నుంచి ఇంటర్‌ వరకు అడ్మిషన్లు ప్రక్రియ సాగుతోంది.

ALSO READ: ఇండియన్ నేవీలో అగ్నివీర్ కొలువులు.. మంచి భవిష్యత్తు, ఇంకెందుకు ఆలస్యం

దీనికితోడు ఖాళీగా ఉన్న 7 నుంచి 10 తరగతి వరకు సీట్ల భర్తీకి దరఖాస్తు ఏప్రిల్‌ 10 వరకు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుచుకోవాలి. ఇక ఆరవ తరగతిలో ప్రవేశం కోసం విద్యార్థినులు ఐదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అడ్మిషన్ల సమయంలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించబడదు. ఇక కేజీబీవీ పాఠశాలలో ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్‌ 13న విడుదల చేస్తారు. ఏప్రిల్ 13- 17 వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేసి సీటును ఓకే చేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×