E-Paper
Advertisement

షాకింగ్.. ‘జబర్దస్త్’ కొమురక్కపై కర్రలతో దాడి.. అభిమానులమని నమ్మించి ఘాతుకం!

షాకింగ్.. ‘జబర్దస్త్’ కొమురక్కపై కర్రలతో దాడి.. అభిమానులమని నమ్మించి ఘాతుకం!
Advertisement

Komurakka Attacked: బుల్లితెర ప్రేక్షకులకు తనదైన మేనరిజంతో వినోదాన్ని పంచే ‘జబర్దస్త్’ ఫేమ్ కొమురక్క (నటుడు శ్రీనివాస్) పై దారుణమైన దాడి జరిగిందని ఆరోపణలు. అభిమానులమని నమ్మించి కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా ఆయనపై విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం మాటలతో కాకుండా రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో కొమురక్కతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

అసలేం జరిగింది? వివాదానికి కారణం ఇదే..
ఈ వివాదానికి బీజం కొన్నాళ్ల క్రితమే పడింది. కొమురక్క ఇంట్లో గతంలో కొంత బంగారం చోరీకి గురైంది. ఈ నేపథ్యంలో ఆయన తన అసిస్టెంట్ శ్రీనాథ్‌పై అనుమానం వ్యక్తం చేయగా, విచారణలో తనే ఆ బంగారం తీసుకున్నట్లు శ్రీనాథ్ అంగీకరించాడు. అయితే, ఎన్నిసార్లు అడిగినా ఆ నగలను తిరిగి ఇవ్వకుండా శ్రీనాథ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కొమురక్క తన అసిస్టెంట్‌ను మరోసారి తీవ్రంగా మందలించడంతో కథ అడ్డం తిరిగింది.

Advertisement

మంగళవారం రాత్రి ఊహించని పరిణామం..
మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలోని కొమురక్క స్వగ్రామానికి ఎనిమిది మంది వ్యక్తులు వచ్చారు. తొలుత తాము ‘జబర్దస్త్’ అభిమానులమని, కొమురక్కను కలవాలని నమ్మబలికారు. తీరా ఆయన ముందుకు రాగానే, “మా ఫ్రెండ్ శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావు?” అంటూ గొడవకు దిగారు. ముందస్తు పథకం ప్రకారమే వచ్చిన ఆ దుండగులు వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
దుండగుల దాడిలో కొమురక్కకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను అడ్డుకోబోయిన మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొమురక్క కోలుకుంటున్నట్లు సమాచారం. ఒక సామాన్య నటుడిపై, అది కూడా సొంత ఊరిలో ఇలాంటి దాడి జరగడంపై కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: తెలంగాణ అమర్ నాథ్ యాత్ర సలేశ్వరం జాతరపై పాలమూరు చిన్నారుల పాట…యూట్యూబ్ లో వైరల్

పోలీసుల రంగప్రవేశం.. నిందితుల అరెస్ట్
ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో బాలానగర్ పోలీసులు తక్షణమే స్పందించారు. హత్యాయత్నం, దాడి కేసుల కింద ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి గాలింపు చేపట్టిన పోలీసులు, తాజాగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నమ్మకద్రోహం చేయడమే కాకుండా, తిరిగి దాడికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×