Minister Lokesh in Canada: ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. ఓ వైపు సీఐఐ సదస్సులు నిర్వహిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా టూర్ తర్వాత కెనడాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. అక్కడి వ్యాపారవేత్తలతో ఆయన సమావేశమయ్యారు.
కెనడాలో మంత్రి నారా లోకేష్
ఏపీకి పెట్టుబడులు రప్పించే లక్ష్యంగా మంత్రి లోకేష్ టూర్ కొనసాగుతోంది. మూడు రోజులపాటు అమెరికాలోని వివిధ కంపెనీలు సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా ఉందని, పరిశ్రమల కోసం తీసుకొచ్చిన పాలసీలను వివరించారు. అంతేకాదు గూగుల్ కూడా ఏపీలోని విశాఖలో పెట్టుబడులు పెడుతుందని వివరించారు.
అమెరికాలో మూడు రోజుల టూర్ తర్వాత కెనడా వెళ్లారు మంత్రి లోకేష్. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీలోని తమ ప్రభుత్వం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తొందని వివరించారు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశం
ఒట్టావాలో పని చేస్తున్న కెనడాలోని పారిశ్రామిక సంస్థలు, సీఈవోలతో మాట్లాడారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, పోటీతత్వం, గ్లోబల్ స్థాయి ప్రతిష్ఠను బలోపేతం చేయడానికి కృషి చేస్తోందన్నారు.
ఇంధనం, ఆర్థిక, సాంకేతికత, తయారీ వంటి పలు రంగాల నుంచి 150కు పైగా సంస్థల ప్రతినిధులు బీసీసీలో భాగస్వాములుగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా వ్యాపార సంస్థలు దాదాపు 1.7 మిలియన్ కెనడియన్లకు ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. అంతేకాదు దేశ జీడీపీలో గణనీయమైన వాటా కలిగి ఉందన్నారు.
ALSO READ: హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్.. మంత్రి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
ముఖ్యంగా AI వినియోగం, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ ఆధారిత ఉత్పాదకతలను ప్రోత్సాహిస్తున్నామని తెలియజేశారు. క్లీన్ టెక్నాలజీ, కార్బన్ ప్రైసింగ్ ఫ్రేమ్ వర్క్, సుస్థిర వనరుల అభివృద్ధికి సపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు ఏపీలో కెనడా సంస్థల పెట్టుబడులకు తమవంతు సహకారం అందిస్తామని అధ్యక్షుడు గోల్డి హైదర్ చెప్పుకొచ్చారు. కెనడా టూర్ ముగియగానే అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు రానున్నారు మంత్రి లోకేష్. గత పర్యటన కన్నా, ఈసారి పర్యటన మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
#InvestInAP
I flew into Toronto today for my next leg of meetings. It was great to connect with Goldy Hyder, President & CEO of @BizCouncilofCan, in Toronto today. This is the premier business council for over 170 businesses employing over 2.1 million Canadians. I spoke to Goldy… pic.twitter.com/TO9KNKX4JX— Lokesh Nara (@naralokesh) December 10, 2025