E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును గుర్తు పట్టి మిస్సమ్మను ఆశీర్వదించమన్న రామ్మూర్తి 

Nindu Noorella Saavasam Serial Today December 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును గుర్తు పట్టి మిస్సమ్మను ఆశీర్వదించమన్న రామ్మూర్తి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

సీమంతానికి ఆరును గుజరాతీ అమ్మాయిలా మార్చేస్తాడు గుప్త. ఆ వేషంలోనే ఇద్దరు వచ్చి ఇంటి ముందు నిలబడతారు. అక్కడ జరిగిన ఏర్పాట్లు చూసిన గుప్త చూచితివా బాలిక నీ సహోదరి సీమంతమునకు మీ తండ్రి ఎంతటి ఘనమైన ఏర్పాట్లు చేసేనో.. అంటాడు గుప్త. అవును గుప్త గారు నా విషయంలోనే ఆయన ఏమీ చేయలేకపోయారు. అందుకే ఆ లోటు తీర్చుకోవడం కోసం నా చెల్లికి అచ్చట ముచ్చట చేయాలనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది అని ఆరు చెప్పగానే.. ఇటుల దూరంగా ఉండి సంతోషించుట ఏలా బాలిక. నీ సహోదరికి గంధము పూసి గాజులు తొడగి అక్షింతలు వేసి ఆశీర్వదింపుము వెళ్లుమ అని గుప్త చెప్పగానే..

ఆరు అనుమానంగా గుప్త గారు నేను చనిపోయాను కదా..? నిన్నేమో ఊరందరికీ కుంకుమ బొట్టు పెట్టి మా చెల్లి సీమంతానికి ఆహ్వానం పలికాను. ఈ రోజు నా చెల్లికి గంధము, పసుపు పూయాలి ఇది తప్పు అవుతుందేమో కదా.? అని అడగ్గానే.. ముమ్మాటికి కాదు బాలిక నీవు నిండు ముత్తైదువుగా మరణించితివి.. ఎప్పటికీ నువ్వు నిత్య సుమంగళివే.. అన్ని విధములా నీకు ఆ అర్హత ఉన్నది అని చెప్పగానే. అయితే ఓకే గుప్త గారు శుభమా అని మా చెల్లి సీమంతం చేసుకుంటుంటే చనిపోయిన నేను ఇక్కడికి రావడము అశుభమేమో అనుకున్నాను.. మీరు చెప్పాక సంతోషంగా ఉంది అని ఆరు చెప్పగానే.. అటుల ఏమీ లేదు బాలిక నీవా శంకలు వదిలి జరుగు శుభకార్యమును వీక్షించుము పద మేము కూడా నీతో వచ్చెదము అని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తుంటే.. రామ్మూర్తి చూస్తాడు. ఆరును చూడగానే.. రామ్మూర్తి ఆ రండి రండి అమ్మ లోపలికి రండి అమ్మా మీరు అని అడగ్గానే..

Advertisement

మాది పక్కూరు అండి ఇలా వెళ్తుంటే.. ఇక్కడ సీమంతం జరుగుతుందని తెలిసి అమ్మాయిని ఆశీర్వదించాలని వచ్చాను అని చెప్తుంది ఆరు.. దీంతో రామ్మూర్తి చాలా మంచిది అమ్మ. నిండు ముత్తైదువులా మహాలక్ష్మీలా ఉన్నావు.. నీలాంటి సుమంగళి నా కూతురును ఆశీర్వదిస్తే.. నా కూతురు నా కూతురుకు పుట్టబోయే బిడ్డ చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే.. ఎందుకో నా పెద్దమ్మాయి అరుంధతియే గుర్తుకు వచ్చింది. తను బతికి ఉంటే అచ్చం నీలాగే ఇలాగే నిండు ముత్తైదువులా ఉండేదమ్మా.. మీరు కొంచెం అటు ఇటుగా మా అమ్మాయి లాగే ఉన్నారు. అమ్మా మీరు తప్పకుండా భోజనం చేసి వెళ్లాలి.. ఈ పేద వాడి ఆతిథ్యం స్వీకరించే వెళ్లాలి. అని రామ్మూర్తి చెప్పగానే.. ఎమోషనల్‌ అవుతున్న ఆరు.. అలాగే బాబాయ్‌ గారు.. నేను మీ కూతురినే అనుకోండి.. కార్యం జరిగే వరకు ఇక్కడే ఉండి తప్పకుండా భోజనం చేసి వెళ్తాను అని ఆరు చెప్పగానే..

రామ్మూర్తి ఎమోషనల్‌ అవుతూ చాలా సంతోషం అమ్మా ఈ సీమంతానికి ఇప్పటి వరకు రాని కల ఇప్పుడు వచ్చింది అమ్మ.. లోపలికి వెళ్లండి అమ్మ అని చెప్పగానే.. బయట ఎవరో రామ్మూర్తిని పిలుస్తారు. రామ్మూర్తి బయటకు వెళ్లిపోతాడు. ఆరు ఏడుస్తుంది. బాలిక ఎందులకు ఆ కన్నీరు అని గుప్త అడగ్గానే.. ఇవి కన్నీళ్లు కాదు గుప్త గారు ఆనందబాష్పాలు నేను ఎవరో తెలియకపోయినా..? మా నాన్న నన్ను తన కూతురివే అన్నారు చాలా సంతోషంగా ఉంది అని ఏడుస్తుంది. దీంతో గుప్త బాలిక నీ రాకతో ఈ సీమంతమునకే కల వచ్చింది అన్నారు.. మాకును సంతోషముగానే ఉన్నది.. అని చెప్పగానే.. అయ్యో గుప్త గారు మీ లాంటి గొప్పగొప్ప వాళ్ల ముందు మా లాంటి మనుషుల సంతోషాలు ఏపాటివి చెప్పండి.. అంటుంది ఆరు.. లేదు బాలిక మానవ సంబంధములలో ఏదో తెలియని ఆనందం ఉన్నది అది అనుభవించిన వారికే తెలియును తప్ప మరోకరికి తెలియుట సాధ్యం కాదు.. కానీ నీ వల్ల ఆ అనుబంధాలను ఆప్యాయతలను మేము అనుభవినుచున్నము పద బాలిక లోపలికి వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.

Advertisement

తర్వాత అందరూ సీమంతం వేడుకలో సరదాగా ఉంటారు. ఇంతలో ఒకావిడ లేచి రామ్మూర్తి గారు ఇక అసలు కార్యక్రమం మొదలు పెట్టించండి అని చెప్తుంది. దీంతో రామ్మూర్తి ఆరు దగ్గరకు వెళ్లి అమ్మా నీ చేతుల మీదుగా నా కూతురుకు తొలి ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్తాడు. సరే అంటూ ఆరు వెళ్లి మిస్సమ్మకు గంధం పెట్టి.. గాజులు తొడిగి అక్షింతలు వేసి ఆశీర్విదిస్తుంది. మిస్సమ్మ ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×