BigTV English

Palnadu SP Malika Garg Mass Waring: పల్నాడు రౌడీలకు లేడీ సింగం మాస్ వార్నింగ్..

Palnadu SP Malika Garg Mass Waring: పల్నాడు రౌడీలకు లేడీ సింగం మాస్ వార్నింగ్..

పల్నాడు అంటే ఏంటి? ఈ ప్రాంతం ఎక్కడుంది? అంటే మనకు ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్‌ తెలుసు. బట్ ఇప్పుడు ఏకంగా సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ పెద్దలు సెంట్రల్‌ హోమ్‌ మినిస్ట్రీ కూడా దీనిపైనే చర్చిస్తుంది. యస్.. మీరు నమ్మడం లేదా.. అయితే పల్నాడు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ మల్లికా గర్గ్‌ ఏం చెబుతున్నారో వినండి.. అదీ సంగతి.. పల్నాడు ఎంత ఫేమస్‌ అయ్యిందో విన్నారుగా అంతా రాజకీయ నేతలు.. కొందరి స్వార్థపూరిత వ్యవహారాలు దీనికి రీజన్.. బట్ ఇదంతా పాస్ట్.. మరి జరగబోయేదేంటి.. ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పోలీసులను అలెర్ట్ చేశాయి. పోలింగ్ రోజు జరిగింది ట్రైలర్ మాత్రమే.. కౌంటింగ్‌ రోజు మరింత మారణహోమం సృష్టించే అవకాశం ఉందని చెబుతోంది ఆ రిపోర్ట్.. మరి పల్నాటి పౌరుషం మళ్లీ ఉప్పొంగితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..ఇప్పటికే పోలీసుల వైఫల్యమే పల్నాడు పరిస్థితి దిగజారడానికి రీజన్‌ అన్న ప్రచారం ఉంది. బట్ దీనిని ఫేస్‌ చేసుందుకు కూడా జిల్లా పోలీస్ బాస్ రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.

So This is the time to show the real power of palnadu Police అంటున్నారు ఎస్పీ మల్లికా.. సో.. కౌంటింగ్ రోజు గొడవ అనే పదం వినపడకూడదు అంటున్నారు ఆమె.. చట్ట వ్యతిరేకంగా ఏ పని చేసినా.. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించినా.. అస్సలు ఊరుకునేది లేదన్నది ఆమె మాట.. మేము ముందు నుంచి మీకో మాట చెప్తూనే వస్తున్నాం.. మీరు ఆవేశంలో అనాలోచితంగా చేసే చిన్న తప్పు.. మీ జీవితంపై చాలా పెద్ద ఎఫెక్ట్‌ చూపుతుందని మా మాట అక్షరసత్యమని రుజువైంది.. అదేలానో ఆ లెడీ సింగం మాటల్లోనే వినండి.


Also Read: కౌంటింగ్‌ టెన్షన్‌.. ఏమౌతుందో!

విన్నారుగా.. పల్నాడు విధ్వంసకాండకు సంబంధించి నమోదైన కేసులు 160.. అరెస్ట్‌ అయిన వారి సంఖ్య అక్షరాల పదమూడు వందల మంది. జస్ట్ 10 రోజుల్లో అంతమందిని తీసుకెళ్లి లోపలేశారు.. అంటే జైళ్లు నిండిపోయాయి. అంటే ఇకపై అరెస్ట్ చేయరని కాదు.. ఇక ముందు అరెస్ట్ చేసిన వారిని డైరెక్ట్‌గా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపించడమే అన్న మాట. అంటే పోలీసులు ఎక్కడా తగ్గడం లేదని దీన్ని బట్టే అర్థమవుతోంది. ఇప్పుడు అరెస్టైన 13 వందల మందిలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన వారు ఉన్నారు.. మరి అందులో బడా రాజకీయ నేతలు కౌంట్ ఎంత? ఈ ప్రశ్న అల్లర్లలో పాల్గొన్నవారు కావొచ్చు.. అరెస్టైన వారు కావొచ్చు.. మీకు మీరే వేసుకొండి. జైల్లో ఉన్నది ఎవరు? స్వేచ్ఛగా బయట తిరిగేది ఎవరు? ఇప్పటికైనా కాస్త ఆలోచించండి.

ఎస్పీగారు చెప్పిన విషయాల్లో ఒక మాట మెదడుకు ఎక్కిందో లేదో అని మళ్లీ రిపీట్ చేస్తున్నా.. ప్రస్తుతం అరెస్టైన 13 వందల మందిలో.. ప్రతి ఒక్కరిపై రౌడీషీట్ ఓపెన్ అవుతుంది. వీరిలో రీపీడెట్ అఫెన్సెస్‌ చేసిన వారు ఉండొచ్చు. ఫస్ట్ టైమ్‌ ఇలాంటి అల్లర్లు చేసిన వారు ఉండొచ్చు.. బట్ ఎవ్వరిని వదలకుండా అందరిపై రౌడీ షీట్‌ ఓపెన్ చేస్తున్నారు.. అంటే మీ జీవితాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోండి..ఇకపై నిత్యం పోలీసుల నిఘా ఉంటుంది.. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా.. ఫస్ట్ ఫోకస్‌పై మీపైనే ఉంటుంది. తరుచూ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది.. కౌన్సిలింగ్స్‌కు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవ్వన్ని చేయాలంటే.. మీరు రోజు చేసే పనులను మానుకోవాలి. తరుచూ పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరగడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకోండి. వీటన్నింటితో పాటు మీకు రౌడీ షీటర్‌ అనే ట్యాగ్‌ ఒకటి తగిలిస్తారు.

అల్లర్లు చేసిన వారంతా ఇప్పటికే జైలుకు చేరారు. అక్కడో ఇక్కడో మిగిలిన వారు.. కౌంటింగ్‌ రోజు తమ ప్రతాపాన్ని చూపాలనుకునే వారు.. ఇకపై తస్మాత్ జాగ్రత్త.. ఈ విషయాలను కాస్త మెదళ్లలోకి ఎక్కించుకోండి. కాదు.. కూడదు.. అంటే మీ బెండు తీసేందుకు ఏపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. పోలీసుల వార్నింగ్‌ చూస్తుంటే.. అస్సలు కనికరం చూపేలా కూడా కనిపించడం లేదు.. సో.. ఇకనైనా కాస్త ఆవేశంతో కాకుండా.. ఆలోచనతో ముందుకు వెళ్లండి.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×