BigTV English

AP Elections Result 2024: కౌంటింగ్‌ టెన్షన్‌.. ఏమౌతుందో!

AP Elections Result 2024: కౌంటింగ్‌ టెన్షన్‌.. ఏమౌతుందో!

టీడీపీ ఏజెంట్లు చేసే కుట్రలను అడ్డుకోవాల్సిందే అంటున్నారు. ఆయన సింపుల్‌.. చాలా స్లో వాయిస్‌తోనే చెప్తున్నారు. బట్ ఆ మాటలు చూపే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదనే చెప్పాలి.. ఎందుకంటే ఏపీలో రాజకీయాల తర్వాతే ఏదైనా అంటారు నేతలు. సో దానికోసం ఎంతకైనా తెగిస్తారని.. ఇప్పటికే పోలింగ్ రోజు మనకు తెలిసిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీలో కీ రోల్ ప్లే చేసే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? అల్లర్లను ఆపాలని చెప్తున్నారా? అలర్లను చేయాలని చెప్తున్నారా? అస్సలు అర్థం కాని సిట్యూవేషన్‌ ఇది. మరి సజ్జల లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే టీడీపీ పెద్దలు ఊరుకుంటారా..? ఊరుకోరు కదా.. వెంటనే కౌంటర్ వచ్చేసింది.

ఇది టీడీపీ నేత దేవినేని ఉమా ఇచ్చిన కౌంటర్.. అఫ్‌కోర్స్‌ సజ్జల మాట్లాడిన దానికి చాలా మసాలా యాడ్ చేశారనుకోండి. బట్ ఇయన కూడా రాజకీయ నేత కాబట్టి.. దానిలోంచి వారికి కావాల్సింది వాళ్లు తీసుకున్నారు. మొత్తనికైతే ఇప్పటికే పోలీస్ కేసు నమోదైంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో సజ్జల చిక్కుల్లో పడ్డారు. అయితే ఇక్కడ టాపిక్‌ కేసులు కాదు.. అదేమంత పెద్ద విషయం కూడా కాదు. బట్ నేతల ఆలోచన ధోరణినే కాస్త కంగారు పెడుతోంది. పార్టీ పెద్దలు కంట్రోల్ చేస్తేనే కింది స్థాయి నేతలు కొన్నిసార్లు మాట వినరు. మరి ఇలా వెనకుండి ప్రొత్సహిస్తే ఇక ఆగుతారా? అనేది క్వశ్చన్.. ఇక్కడ సజ్జల ఆన్‌ రికార్డ్ మాట్లాడారు కాబట్టి దొరికిపోయారు. బట్ తెర వెనక మంతనాలు జరిపే వారు అన్ని పార్టీల్లో ఉంటారు. అదే కంగారు పెడుతోంది.


Also Read: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత కూడా నచ్చినవారికి..

చూస్తుంటే అధికారం, పదవి కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టుగా ఉన్నారు నేతలు. ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్లండి. ఏపీ ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీస్‌శాఖను అలర్ట్ చేసింది. కొన్ని ఏరియాల పోలీసులను స్పెసిఫిక్‌గా వార్న్‌ చేసింది ఏపీ ఇంటెలిజెన్స్.. మరి కౌంటింగ్‌ రోజు అల్లర్లు జరగకుండా తీసుకుంటున్న చర్యలేంటి? ప్రస్తుతం పేరుకు వైసీపీ అధికారంలో ఉన్నా.. పాలన పగ్గాలు మాత్రం ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉన్నాయి. పోలింగ్ జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని.. ఏపీపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర బలగాలను అప్రమత్తం చేసింది. జిల్లా ఎస్పీలకు కూడా స్పెషల్ ఆర్డర్స్‌ వెళ్లాయి.

అన్ని జిల్లాల్లో ఇప్పటికే రౌడీ షీటర్లు, సమస్యాత్మకంగా మారుతారు అనే వారి లిస్ట్ జిల్లా పోలీస్‌ బాస్‌ల వద్దకు చేరింది. రౌడీ షీటర్లను ముందుస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. అలా కుదరని వారిని హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా సమస్యగా మారుతారు అనుకున్న వారిని జిల్లాలు వదిలి వెళ్లాలని ఆర్డర్ వేస్తున్నారు. కౌంటింగ్ ముగిసే వరకు మాత్రమే కాదు. కౌంటింగ్‌ ముగిసిన రెండు రోజుల తర్వాత వరకు కూడా ఇవే ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి.

కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అవాంచనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను కూడా స్టాండ్‌బైలో ఉంచుతున్నారు. సో రాజకీయ పార్టీలైనా.. పోలింగ్ ఏజెంట్లైనా.. పార్టీ కార్యకర్తలైనా.. కాస్త బాధ్యతగా వ్యవహరించండి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పోయిన ఏపీ పరువు చాలు. చట్టాలకు లోబడి మీకున్న ప్రతి ఒక్క హక్కును వినియోగించుకోండి. నిరసనలు కూడా వ్యక్తం చేయండి చాలు. బట్ హద్దు మీరకండి.. మీ జీవితాలను చిన్నాభిన్నం చేసుకోకండి. కౌంటింగ్‌ను ప్రశాంతంగా ముగిసేలా చూడండి.

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×