BigTV English

Yezdi Adventure Bike: ఈ బైక్‌ కొంటే రూ. 17,000 విలువైన టూరింగ్‌ యాక్ససిరీస్‌ ఫ్రీ.. వదలొద్దు మావ!

Yezdi Adventure Bike: ఈ బైక్‌ కొంటే రూ. 17,000 విలువైన టూరింగ్‌ యాక్ససిరీస్‌ ఫ్రీ.. వదలొద్దు మావ!

yezdi adventure bike price: అడ్వెంచరస్ బైక్స్ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటి బైక్‌తో రైడ్ చేయాలని అందరికీ ఉంటుంది. మరి అలాంటి మిడ్ అడ్వెంచర్ బైక్స్ విభాగంలో బడ్జెట్ మోటార్ సైకిళ్లను అందిస్తున్న కంపెనీల్లో యెజ్డీ సంస్థ ఒకటి. ఈ కంపెనీకి చెందిన యెజ్డీ అడ్వెంచర్ బైక్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. బైక్ ప్రియులకు అద్భుతమైన అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ బైక్‌లను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ కంపెనీ యెజ్డీ అడ్వెంచర్ బైక్‌కి సంబంధించి అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది.


ఆ ఆఫర్ విషయానికొస్తే.. యెజ్డీ అడ్వెంచర్ బైక్‌ను కొనుగోలు చేసేవారికి ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ఈ బైక్ కొనుగోలు దారులకు ఫ్రీగా మౌంటైన్ ప్యాక్ యాక్ససరీలను కంపెనీ అందిస్తోంది. అంటే ఒకరకంగా చూస్తే ఈ ఆఫర్ ట్రావెల్ ప్రియులకు బంపరాఫర్ అని చెప్పొచ్చు. ఈ మౌంటైన్ ప్యాక్ యాక్ససరీల వస్తువుల విషయానికొస్తే.. ఇందులో 5 లీటర్ జెర్రీ క్యాన్లు, జుర్రీ క్యాన్ హోల్డర్స్, హెడ్ ల్యాంప్ గ్రిల్, క్రాష్ గార్డ్, బార్ ఎండ్ వెయిట్‌తో కూడా హ్యాండ్ గార్డ్స్ వంటి ప్రాక్టికల్ టూరింగ్ యాక్ససరీలను కంపెనీ అందిస్తోంది. ఈ యెజ్డీ అడ్వెంచర్ బైక్ కొనుగోలుపై ఈ యాక్ససరీలను కంపెనీ ఫ్రీగా అందిస్తోంది.

ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే.. ఈ అడ్వెంచర్ బైక్ కలర్, ఎక్స్ షోరూమ్ బట్టి రూ.2.16 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. కాగా ఇది యెజ్డీ రోడ్‌స్టర్, యెజ్డీ స్క్రాంబ్లర్, యెజ్డీ అడ్వెంచర్ అనే మూడు బైక్ మోడళ్లను కంపెనీ కలిగి ఉంది. అయితే ఈ మూడు మోడళ్లలో ఒకే ఇంజిన్ ఆప్షన్‌ను ఉంటుంది. ఇది 334 సిసి – సింగిల్ సిలిండర్ – లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.


Also Read: రూ.46 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ తెలిస్తే వదలరు!

అంతేకాకుండా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్లను ఈ బైక్‌లు కలిగి ఉన్నాయి. రోడ్‌స్టర్ 29.3 బిహెచ్‌పి పవర్, 29ఎన్‌ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే స్క్రాంబ్లర్ 28.7బిహెచ్‌పి పవర్, 28.2ఎన్‌ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక అడ్వెంచర్ 29.7బిహెచ్‌పి పవర్, 29.9 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Yezdi అడ్వెంచర్ 35.16 kmpl మైలేజ్‌ని అందిస్తుంది. ఇది అన్ని వేరియంట్లకు ఒకేలా ఉంటుంది. ఈ అడ్వెంచర్ బైక్‌లు సుదూర ప్రయాణాలు చేసేవారికి మంచి అనుభూతిని అందిస్తాయి.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×