BigTV English

Pawan Comments on Jagan: జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. నా సినిమాలు ఆపితే ఆపుకో: పవన్!

Pawan Comments on Jagan: జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. నా సినిమాలు ఆపితే ఆపుకో: పవన్!

Pawan Kalyan Comments on CM Jagan about on his Movies: జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. నా సినిమాలు ఆపితే ఆపుకో అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం గుడివాడలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. జగన్ ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని.. వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో దీపమే అని ఆయన అన్నారు.


‘ఎవరైనా చెరువులు తవ్విస్తారు.. కానీ వీళ్లు కబ్జా చేశారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలి. రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరతే ఉండదు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జగన్ ప్రభుత్వం.. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదు. జగన్ ను చూసి, వైసీపీ నాయకులను చూసి భయపడాలా?.. జగన్ అంటే నాకు భయం లేదు. నా సినిమాలు ఆపితే ఆపుకో. మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతాం.. మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ.. వెనక్కి తీసుకోకూడదు’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్


ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరమేమొచ్చిందంటూ జగన్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయినరోజు ఎన్ని వేల రూ. కోట్లున్నా నిష్ర్పయోజనమే అని ఆయన అన్నారు. చంద్రబాబు బలమైన నాయకుడు.. జైలులో ఉన్నా కూడా ఆయన ఏ మాత్రం తొణకలేదన్నారు. అలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు. 30 కేసులుండి.. ఐదేళ్ల నుంచి జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. తాము అధికారంలోకి వచ్చినాక మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×