E-Paper
Advertisement

Best Camera Phones Under ₹ 15,000: రూ.15 వేలలో బెస్ట్ కెమెరా క్వాలిటీ ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్లు.. మీరే ఓ లుక్కేయండి!

Best Camera Phones Under ₹ 15,000: రూ.15 వేలలో బెస్ట్ కెమెరా క్వాలిటీ ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్లు.. మీరే ఓ లుక్కేయండి!
Advertisement

Best Camera Phones Under Rs 15,000 only: మార్కెట్‌లో మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్లకు సూపర్ డిమాండ్ ఉంది. దీని కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్‌లో కెమెరా ఫోన్‌ల డిమాండ్ గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు డబుల్, ట్రిపుల్ కెమెరాలతో కూడిన మొబైళ్లను విడుదల చేస్తున్నాయి. అందులో Samsung, Xiaomi, Realme, vivoతో సహా చాలా బ్రాండెడ్ కంపెనీలు సైతం మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేశాయి. మరి మీరు కూడా మంచి కెమెరా కలిగిన మొబైల్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కేవలం రూ. 15,000 ధర పరిధిలో హై-ఎండ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లను ఇక్కడ అందించాం. ఇందులో మీకు నచ్చిన మొబైల్‌ను కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు.

iQOO Z6 Lite 5G:

Advertisement

స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల 120Hz FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. 1080 x 2408 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. Qualcomm Snapdragon 4 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5000 mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ v12పై ఫోన్ రన్ అవుతుంది. దీని 6/128జీబీ ధర రూ.19,999గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,999లకి కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP+ 2MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన సింగిల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందువైపు 8 MP సెల్ఫీ షూటర్ ఉంది.

Also Read: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. సామ్‌సంగ్ కొత్త 5జీ ఫోన్‌పై రూ. 45000 భారీ డిస్కౌంట్

Advertisement

Motorola G34 5G:

మోటోరోలా జి 34 5జీ మొబైల్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది దాని కెమెరా క్వాలీటీతో వినియోగదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 8/128జీబీ ధర రూ.14,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,999లకే కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ వెనుక భాగంలో 50MP + 2MP కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

realme 12x 5G:

రియల్ మి 12ఎక్స్ 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. దీని 6/128జీబీ ధర రూ.17,999 ఉండగా ఇప్పుడు కేవలం 27 శాతం తగ్గింపుతో రూ.12,999లకే కొనుక్కోవచ్చు. ఇది 6.72 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50MP + 2MP ప్రధాన కెమెరా సెటప్ ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా సెటప్‌ను అందించారు. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీతో ఇది వస్తుంది.

Also Read: Vivo Y18 Series Launched : వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. రూ.439 లకే దక్కించుకునే ఛాన్స్!

Motorola g64 5G:

మోటోరోలా జి64 5జీ మొబైల్ 8/128జీబీ ధర రూ.17,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం తగ్గింపుతో రూ.13,999లకే కొనుక్కోవచ్చు. దీని కెమెరా క్వాలిటీ పోన్ ప్రియులను మంత్రముగ్దులను చేస్తుంది. ఇది 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో 50MP (OIS) + 8MP కెమెరాను అందించారు. ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అందించారు.

POCO M6 Pro 5G:

పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీని 8/256 జీబీ ధర రూ.17,999 ఉండగా ఇప్పుడు 36 శాతం తగ్గింపుతో రూ.11,499లకే కొనుక్కోవచ్చు. ఇది 6.79 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50MP + 2MP కెమెరా సెటప్.. అలాగే ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. వీటితో పాటు మరిన్ని స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×