E-Paper
Advertisement

Pawan vs ycp : పవన్ vs వైసీపీ… భయపెడతారా? భయపడతారా?

Pawan vs ycp : పవన్ vs వైసీపీ… భయపెడతారా? భయపడతారా?
Advertisement

ఏపీ రాజకీయాలు ‘నువ్వా నేనా’ అన్నట్టు రంజుగా సాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశంపై రాజకీయ రగడ నెలకొన్నది. కూటమి సర్కార్ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరించి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. అయితే, అది ప్రయివేటీకరణ కాదని, కేవలం అభివృద్ధి మాత్రమే పబ్లిక్ అండ్ ప్రయివేటు భాగస్వామ్యంతో నడుస్తుందని, మిగతా అజమాయిషీ, ఫీజుల నియంత్రణ ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు దానిపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై నిన్న ఘాటుగా స్పందించారు. అదేవిధంగా తాను సీట్లు అమ్ముకున్నానని వస్తున్న విమర్శలపైనా తీవ్రంగా స్పందించారు.

మేమే తలుచుకుంటే మళ్లీ పోటీచేస్తారా?

వైసీపీ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామని భ్రమ పడుతున్నారని, వచ్చాక అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.మెడికల్ కాలేజీలపై ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తాము వైసీపీ నాయకుల మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నామని వస్తున్న విమర్శలపైనా స్పందిస్తూ..కూటమి సర్కార్ నిజంగానే కక్ష పూరితంగా వ్యహరిస్తే మరోసారి తాము అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకులు ఎలా చెబుతారని..అసలు వాళ్లు పోటీ చేయగలరా? అని సైతం పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

కాలుకు కాలు.. కీలుకు కీలు..

Advertisement

అదే విధంగా తాను గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నానని వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించిన పవన్.. తాను ఏమీ సీట్లు అమ్ముకోలేదని.. ప్రజల కోసమే తాను సీట్లు తగ్గించుకున్నానని క్లారిటీ ఇచ్చారు. జనసైనికులకు సీట్లు ఇవ్వకుండా పవన్.. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా పవన్ వాటిని కొట్టిపారేశారు. ‘అధికారమున్నా లేకున్నా నేను నాలాగే ఉంటా.బెదిరించే నాయకులకు భయపడను. యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారు. కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తే ఆకు రౌడీలు దారొకొస్తారు’ అని హెచ్చరించారు. అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ కీలకనేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

 

Advertisement

పవన్‌కు అంత సీన్ లేదని, సినిమా డైలాగులు కొడితే ఇక్కడ ఎవరూ భయపడరని ఆయన కౌంటర్ ఇచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ఆరోపించారు. దుమ్ముంటే పవన్ తన జనసేనికులు, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు భాగస్వామ్యం పేరిట దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మరల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, అటు పవన్ ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా సోషల్ మీడియాలో మరో చర్చ జరుగుతున్నది. అధికారంలో ఉన్న పవన్ తాను భయపెడతా.. అని అంటుంటే.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు భయపడేది లేదు అని అనడంతో.. పవన్ మరి నిజంగా భయపెడతారా? భయపడతారా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×