E-Paper
Advertisement

Sleep Paralysis: ఛాతిపై దెయ్యం కూర్చొని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? అసలు కారణం ఇదే!

Sleep Paralysis:  ఛాతిపై దెయ్యం కూర్చొని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? అసలు కారణం ఇదే!
Advertisement

Sleep Paralysis: రాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మెలకువ రావడం, కానీ శరీరం ఇంచు కూడా కదలకపోవడం, గట్టిగా అరుద్దామన్నా గొంతులోంచి శబ్దం రాకపోవడం..ఈ అనుభవం చాలా భయానకంగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరో మన ఛాతీపై కూర్చుని నొక్కిపెట్టినట్లు, ఊపిరి ఆడనట్లు కూడా అనిపిస్తుంది. పాత కాలంలో దీనిని ‘దయ్యం పట్టి పీడించడం’ అని పిలిచేవారు. కానీ.. దీనిని “స్లీప్ పెరాలిసిస్” లేదా “నిద్ర పక్షవాతం” అని పిలుస్తారు. దీని వెనక ఉన్న అసలు కారణాలు, ఆ సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుంది ? దీని నుండి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీప్ పెరాలిసిస్ అంటే ఏంటి ?
స్లీప్ పెరాలిసిస్ అనేది నిద్రపోయేటప్పుడు లేదా నిద్ర నుంచి మేల్కొనేటప్పుడు జరిగే ఒక తాత్కాలిక స్థితి. ఈ సమయంలో వ్యక్తి స్పృహలోనే ఉంటాడు కానీ శరీరాన్ని కదపలేడు. ఇది సాధారణంగా కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. ఇది ప్రాణాపాయం కాకపోయినప్పటికీ ఆ సమయంలో కలిగే భయం మాత్రం వర్ణనాతీతం.

Advertisement

శాస్త్రీయ కారణం:

మనం నిద్రపోయేటప్పుడు మన మెదడు వివిధ దశల గుండా వెళుతుంది. అందులో ఒకటి REM (Rapid Eye Movement) నిద్ర. ఈ దశలోనే మనకు కలలు వస్తాయి.

Advertisement

శరీరం ‘లాక్’ అవ్వడం: మనం కలలో చేసే పనులను (ఉదాహరణకు పరిగెత్తడం, ఎగరడం) నిజంగా చేయకుండా ఉండేందుకు.. మెదడు మన కండరాలను తాత్కాలికంగా పక్షవాతం స్థితిలోకి పంపిస్తుంది. అంటే శరీరాన్ని ‘లాక్’ చేస్తుంది. కండరాలు ఇంకా లాక్ అయ్యి ఉన్న స్థితిలోనే మెదడు అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు స్లీప్ పెరాలిసిస్ ఏర్పడుతుంది. అంటే మీ మనస్సు మేల్కొంది కానీ మీ శరీరం ఇంకా నిద్రలోనే ఉండిపోయింది.

ఛాతీపై ఒత్తిడి ఎందుకు కలుగుతుంది ?
ఈ స్థితిలో ఉన్నప్పుడు చాలామందికి ఎవరో తమ పక్కన ఉన్నట్లు లేదా తమ ఛాతీపై కూర్చున్నట్లు అనిపిస్తుంది. దీనికి కారణం. నిద్రలో శ్వాసక్రియ నెమ్మదిగా, గాఢంగా ఉంటుంది. మనం మేల్కొన్నప్పుడు మనకు తెలియకుండానే వేగంగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఛాతీ కండరాలు ఇంకా నిద్ర స్థితిలోనే ఉండటం వల్ల అవి సహకరించవు. దీనివ ల్ల ఎవరో మన గొంతు నొక్కుతున్నట్లు లేదా ఛాతీని తొక్కుతున్నట్లు భ్రమ కలుగుతుంది.

భయం: శరీరం కదలడం లేదు అనే భయంతో మెదడు “హాలూసినేషన్స్” లేదా భ్రాంతులను సృష్టిస్తుంది. గదిలో ఏదో నల్లని నీడ ఉన్నట్లు.. వింత శబ్దాలు వినబడుతున్నట్లు అనిపిస్తుంది.

స్లీప్ పెరాలిసిస్‌కు దారితీసే కారణాలు:
పరిశోధనల ప్రకారం.. ఈ కింది కారణాల వల్ల ఇది సంభవించే అవకాశం ఉంది.

నిద్రలేమి: సరిగ్గా నిద్రపోకపోవడం లేదా నిద్రపోయే సమయాలు మారడం .

ఒత్తిడి, ఆందోళన: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు నిద్ర చక్రం దెబ్బతింటుంది.

పడుకునే పద్ధతి: వెల్లకిలా (వెన్నుపై) పడుకునే వారిలో ఇది ఎక్కువగా సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మందులు: కొన్ని రకాల మందుల వాడకం.

నార్కోలెప్సీ: రోజంతా విపరీతమైన నిద్ర వచ్చే ఒక రకమైన నిద్ర రుగ్మత.

ఆ భయంకర స్థితి నుంచి బయటపడటం ఎలా?
ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే.. భయపడకుండా ఈ కింది చిట్కాలు పాటించండి.

ప్రశాంతంగా ఉండండి: ఇది కేవలం తాత్కాలిక స్థితి అని, మీకు ఏమీ కాదని మీ మెదడుకు చెప్పుకోండి. భయపడితే ఛాతీపై ఒత్తిడి మరింత పెరిగినట్లు అనిపిస్తుంది.

చిన్న కదలికలు: శరీరాన్ని మొత్తం కదపడానికి ప్రయత్నించకుండా.. కేవలం మీ వేలిని లేదా కాలి వేలిని కదపడానికి ప్రయత్నించండి. లేదా కనుబొమ్మలను కదిలించండి. ఇది మెదడును పూర్తిగా మేల్కొలిపి, కండరాల ‘లాక్’ని తొలగిస్తుంది.

ముఖ కండరాలు: నాలుకను కదపడం లేదా గట్టిగా నవ్వడానికి లేదా దగ్గడానికి ప్రయత్నించడం ద్వారా త్వరగా సాధారణ స్థితికి రావచ్చు.

Also Read: మందులతో పాటు ఈ 8 ఆహారాలు తీసుకుంటే.. షుగర్ లెవల్స్ మీ చేతుల్లోనే!

నివారణ మార్గాలు:
సరైన నిద్ర: ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

పక్కకు తిరిగి పడుకోండి: వెల్లకిలా పడుకోవడం కంటే.. ఎడమ లేదా కుడి పక్కకు తిరిగి పడుకోవడం వల్ల స్లీప్ పెరాలిసిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

కెఫిన్ నియంత్రణ: రాత్రిపూట కాఫీ, టీ లేదా ఆల్కహాల్‌ను నివారించండి.

వ్యాయామం: రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల గాఢ నిద్ర పడుతుంది.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×