BigTV English

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ సంచలన వ్యాఖ్యలు.. తనకు ఏమైనా జరిగితే వారిదే బాధ్యత

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ సంచలన వ్యాఖ్యలు.. తనకు ఏమైనా జరిగితే వారిదే బాధ్యత

Borugadda Anil: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కోసం పోలీసుల వేట మొదలైంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడున్నాడనే దానిపై ఫోకస్ చేశారు పోలీసులు. తాజాగా తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచనల వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అనిల్ మాటల్లో ఏమైనా నిజముందా? లేక కొత్త డ్రామా మొదలుపెట్టాడా? అన్నది అసలు పాయింట్.


బోరుగడ్డ అనిల్ ఎక్కడ?

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. తనకు గంట సమయం ఇస్తే వారిని లేపేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల ఫలితమే ఇప్పుడు కనిపించకుండా తిరుగుతున్నారు. తాజాగా బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియోపై అనంతపురం పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ వీడియోలో ఏముంది?


బోరుగడ్డ సెల్ఫీ వీడియో రహస్యం

తనకు బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు బోరుగడ్డ అనిల్. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ వెనుక ఉన్నారని ఆరోపించాడు. తనను చంపాలని చూస్తున్నారని, తనకుగానీ, కుటుంబానికి గానీ ఏమైనా అందుకు కారణం పై ముగ్గురు నేతలేనని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం తాను మధ్యంతర బెయిల్ పై ఉన్నానని తెలిపాడు బోరుగడ్డ. కన్నతల్లిని చూసేందుకు చెన్నై వచ్చానన్నాడు. తనకు దేవుడు, జగన్ దిక్కని తెలిపాడు. గతంలో జరిగిన పరిణామాలకు.. ప్రస్తుతం జరుగుతున్నవి మీరు చూస్తున్నారని తెలిపాడు. న్యాయస్థానాలంటే తనకు గౌరవం ఉందని చెబుతూనే, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

ALSO READ: మహిళా దినోత్సవం రోజు లేడీ డాక్టర్‌కు అవమానం

ఆ సెక్షన్ వర్తించదు-అనిల్

తల్లికి గుండె ఆపరేషన్ అయ్యిందని, ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పుకొచ్చారు అనిల్. న్యాయస్థానం దీన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.  తనపై  బ్యాడ్ ప్రచారం చేయడానికి  అనంతపురం సీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టాడు. తనపై 111 సెక్షన్ పెట్టారన్నారు. ఈ సెక్షన్ తనకు వర్తించదన్నారు. సెక్షన్ వర్తించిందన్నప్పుడు నేరుగా న్యాయస్థానం గడప తొక్కవచ్చు కదా? అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న పోలీసులు, బోరుగడ్డ వెనుక బలమైన శక్తులు ఉన్నట్లు భావిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బోరుగడ్డ ఎవర్ని కలిశాడు? అనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. సోషల్‌ మీడియాలో వీడియోను ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అనే దానిపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. తల్లితో చెన్నైలో ఉన్నట్లు బోరుగడ్డ చెప్పినప్పటికీ, తెలంగాణలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వైసీపీ నాయకులు ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్లు సమాచారం.

బెయిల్ రద్దు కోసం పోలీసుల ప్రయత్నాలు

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై అనంతపురం పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోర్జరీ మెడికల్ సర్టిఫికెట్ చూపించి సెల్ఫీ వీడియోలో మొసలి కన్నీరు కార్చడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే అనిల్ బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు పోలీసులు. ఇదిలావుండగా బెయిల్ కోసం పోర్జరీ సర్టిఫికెట్లు క్రియేట్ చేసిన దానిపై పూర్తి ఆధారాలతో గుంటూరు పోలీసులు రెడీ చేసిన నివేదికను అనంతపురం పోలీసులకు అందచేశారు.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, యువనేత లోకేశ్‌ను ఇష్టమొచ్చినట్టు దూషించిన కేసుల్లో అరెస్టయ్యాడు బోరుగడ్డ. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై అజ్ఞాతంలో ఉన్నాడు. హైకోర్టు నుంచి బెయిల్‌ కోసం ఫోర్జరీ మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించిన విషయాన్ని పోలీసులు ఆసల్యంగా గుర్తించారు.

 

Related News

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Big Stories

×