Kakinada News: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళా దినోత్సవం రోజు ఓ మహిళ డాక్టర్‌కు ఘోర అవమానం జరిగింది. ప్రత్తిపాడు పీహెచ్‌సీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించారు జనసేన నాయకులు. వైద్యురాలితో పాటు సిబ్బంది, చికిత్స పొందుతున్న రోగులను భయాందోళనకు గురి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రతిపాడు పీహెచ్‌సీలో ఏం జరిగింది?
ఆసుపత్రి సిబ్బంది చెప్పిన వివరాల మేరకు రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు ట్రీట్‌మెంట్ నిమిత్తం కొందరు వ్యక్తులు కాగినాడు జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రి తీసుకొచ్చారు. విధుల్లో ఉన్న వైద్యురాలు శ్వేత వెంటనే స్పందించి చికిత్స మొదలుపెట్టారు. అదే సమయంలో కొందరు ఆసుపత్రిలోకి దూసుకొచ్చారు.
ఎందుకు జనసేన నేత ఆగ్రహం
రోడ్డు ఘటన బాధితుడ్ని ఎవరు తీసుకొచ్చారు? ఏం జరిగింది? అడుగుతూ ఆయా వివరాలను తమ పార్టీ నాయకుడికి చెప్పాలని వైద్యురాలికి ఫోన్ ఇచ్చారు. అవతలివారు ఎవరో తెలియని డాక్టరమ్మ, బాధితుడికి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. ఈలోగా ప్రత్తిపాడుకు చెందిన జనసేన ఇన్‌చార్జ్ వరుపుల తమ్మయ్యబాబు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎవరో తెలియదా? చెప్పింది చేయాలని తెలియదా? తమ్మయ్య బాబు అతని అనుచరులు వీరంగం సృష్టించడం, గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది, రోగులు కాసింత ఆందోళనకు గురయ్యారు. వీడియో చిత్రీకరిస్తున్న సిబ్బంది నుంచి ఫోన్ లాక్కున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఫోన్లలో రికార్డు చేసిన దృశ్యాలు తొలగించారు.
ALSO READ: మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వరాలు
పోలీసులు సైలెంట్‌పై విమర్శలు
ఆసుపత్రి ముందు ఈ తతంగా జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీహెచ్‌సీలో జరిగిన ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. తనపై జరిగిన దాడిని కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు డాక్టర్ శ్వేత. మరోవైపు ఈ వ్యవహారం జనసేన హైకమాండ్ దృష్టికి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మహిళా దినోత్సవం రోజే లేడీ డాక్టర్ కు అవమానం..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రిలో జనసేన నాయకుల వీరంగం
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వచ్చిన బాధితులు
క్షతగాత్రులకు వైద్యం చేసిన నైట్ డ్యూటీ డాక్టర్ శ్వేత
అదే సమయంలో ఆసుపత్రికి వచ్చిన ప్రత్తిపాడు జనసేన ఇంఛార్జ్ వరుపుల… pic.twitter.com/5q9kR3e9J6
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025