BigTV English

AP Monalisa: మళ్లీ మొదలైంది మోనాలిసా మాయ.. ఈసారి ఏపీలో!

AP Monalisa: మళ్లీ మొదలైంది మోనాలిసా మాయ.. ఈసారి ఏపీలో!

AP Monalisa: కుంభమేళాలో మెరిసిన మోనాలిసా గుర్తుంది కదా.. ఇప్పుడు ఆ మోనాలిసా స్టైల్ వేరబ్బా అనే స్థాయిలో మారిపోయింది. అయితే ఏపీలో ఇప్పుడు మోనాలిసా మెరిసిపోతోంది. మోనాలిసా ఏంటి? ఏపీలో ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.


కుంభమేళా సమయంలో సోషల్ మీడియా వేదికగా, మోనాలిసా ఎంత హల్చల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుంభమేళాలో పూసలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న యువతి పేరే మోనాలిసా. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ యువతి, ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ గా మారింది. కుంభమేళాలో మొత్తం మీడియా ఈమె చుట్టూ తిరిగిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ట్రెండీగా మారిన మోనాలిసాకు సినిమా ఛాన్సులు వచ్చేదాక సోషల్ మీడియా వదల్లేదని చెప్పవచ్చు.

ఎట్టకేలకు సినిమాలో ఛాన్స్ రావడం, తన అభినయాన్ని పూర్తిగా మార్చి ఇప్పుడు ఆ మోనాలిసా ట్రెండ్ సెట్ చేసింది. పూసలు విక్రయించే యువతిని సెలబ్రిటీ చేసే వరకు సోషల్ మీడియా వదల్లేదు. ఇదే తరహాలో ఏపీలో ఓ మోనాలిసా హల్చల్ చేస్తోంది. కుంభమేళా మోనాలిసాను వదిలిపెట్టిన సోషల్ మీడియా ఇప్పుడు ఏపీ మోనాలిసా చుట్టూ తిరుగుతోంది.


ఏపీ మోనాలిసా ఎవరు?
సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇన్ స్టా పేజీలో ఓ యువతి డ్యాన్స్ వేస్తూ వైరల్ గా మారింది. అక్కడ డ్యాన్స్ చేసింది, భక్తి గీతాలకే అయినప్పటికీ తెగ వైరల్ చేశారు ఆ యువతిని. ఈ వీడియో వైరల్ కావడంపై నెటిజన్స్ మాత్రం మోనాలిసా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ యువతి డ్యాన్స్ చేయడంలోనూ, హావభావాలు పలికించడంలోనూ దిట్టగా చెప్పవచ్చు.

ఈమె పేరే పూజ.. ముద్దు పేరు మమ్ము
ఈ యువతి ఎవరని సోషల్ మీడియా తెగ శోధిస్తోంది. అయితే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువతి అంటూ కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ యువతి పేరు పూజ అని, భక్తి గీతాలకు సాంప్రదాయ వస్త్రధారణతో డ్యాన్స్ చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది.

Also Read: Murali Nayak: దేశం మరిచిపోలేదు.. మురళీ నాయక్ కుటుంబానికి విరాళాల వెల్లువ!

ఇటీవల ఒక్కసారిగా ఈ యువతికి క్రేజ్ రావడంతో, ఆ యువతి సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయగా, క్షణాల్లో ఫాలోవర్స్ వచ్చారు. మొత్తం మీద కుంభమేళా మోనాలిసాను వదిలి ఇప్పుడు ఏపీ మోనాలిసాను ఫేమస్ చేయడంలో సోషల్ మీడియా నిమగ్నమైంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×