PM Modi : ప్రధాని మోదీ ఏం చేసినా దానికో లెక్కుంటుంది. ఆ లెక్క వెనుక పాకిస్తాన్ తిక్క కుదిర్చే స్కెచ్ ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ అయినప్పటి నుంచీ ప్రధాని మోదీ బయటకి కనిపించనే లేదు. ఇంట్లోనే ఉన్నారు. 24 గంటలూ సిందూర్‌ను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. సలహాదారు అజిత్ ధోవల్‌తో గంటల తరబడి చర్చలు జరిపారు. సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో రోజుల తరబడి వ్యూహాలు రచించారు. పాకిస్తాన్‌కు రోజుకో షాక్ ఇచ్చారు. దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఆపరేషన్ సిందూర్ మొదలైన రోజు రాత్రి.. ప్రధాని అసలు నిద్రనే పోలేదని అంటారు. ఉగ్ర స్థావరాలపై దాడుల అప్‌డేట్స్‌ను మినిట్ టు మినిట్ అడిగి తెలుసుకున్నారని చెబుతారు. ఆ తర్వాత పాక్ డ్రోన్ అటాక్స్‌కు తెగబడటం.. వెంటనే ఆర్మీ అలర్ట్ అయి ఎదురుదాడులు చేయడం.. ఇలా ఆపరేషన్ ఆసాంతం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందనేది వాస్తవం. పాక్ అణ్వాయుధాలను డ్యామేజ్ చేసి రేడియేషన్ లీక్ అయ్యే స్థాయిలో దాయాది దేశాన్ని దారుణంగా దెబ్బకొట్టింది ఆర్మీ. ఆ క్రెడిట్ ముమ్మాటికీ పీఎం మోదీకే దక్కుతుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసాకే.. మోదీ మళ్లీ బయట కనిపించారు. సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్ కాళ్లబేరానికి వచ్చిందని.. ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. మంగళవారం నేరుగా పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్ బేస్‌కు తరలివెళ్లి మరింత షాక్ ఇచ్చారు.
వ్యూహం ప్రకారమే అదంపూర్ టూర్
మోదీ సెలక్షన్ అదిరింది. అదంపూర్ బేస్‌ను ఎంచుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉంది. గంటన్నర పాటు సైనికులతో గడిపారు. వారికి అండాదండాగా నిలిచారు. జవాన్లలో ధైర్యం నింపారు. అదంపూర్‌లో మోదీ ప్రతీ మూవ్‌మెంట్ ఓ స్ట్రాటజిక్‌గా సాగింది. అక్కడి ఫోటోలు, వీడియోలతో పాకిస్తాన్‌కు క్లియర్ కట్ మెసేజ్ వెళ్లింది. పీఎం మోదీ సెల్యూట్ చేసే ఫోటో అన్నిటికంటే హైలైట్. ఆ ఒక్క ఫోటోతో రెండు స్ట్రాంగ్ మెసేజ్‌లు ఇచ్చారు. ఆ ఫోటోలో మోదీ వెనకాల.. S 400 కనిపించింది. మోదీలానే ఠీవీగా నిలుచుని ఉంది మన సుదర్శన చక్రం. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టింది ఆ ఫోటో.
ఒక్క ఫోటోతో స్ట్రాంగ్ మెసేజ్
యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఫేక్ ప్రచారాన్నే నమ్ముకొని పరువు నిలుపుకుంటోంది పాకిస్తాన్. భారత్‌లోని అదంపూర్ ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో దాడి చేసి నాశనం చేశామని ప్రకటించుకుంది. అదంపూర్‌లో S 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేశామని ప్రచారం చేసుకుంది. అదంతా ఫేక్ అని.. అదంపుర్ ఎయిర్ బేస్ సురక్షితంగా ఉందని పాకిస్తాన్‌తో పాటు యావత్ ప్రపంచానికి చాటిచెప్పేలా.. ప్రధాని మోదీ కావాలనే అదంపూర్ బేస్‌కు వెళ్లారు. తమ సైనిక స్థావరం సేఫ్ అండ్ పర్‌ఫెక్ట్ అని చాటిచెప్పారు. ఎస్ 400 బ్యాక్‌గ్రౌండ్‌లో నిలుచొని.. మన ఆర్మీ సత్తా ఘనంగా చాటారు. మరో ఫోటోలో మోదీ వెనకాల రఫేల్ ఫైటర్ జెట్ కూడా ఉంది. మన యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందనే ప్రచారానికి అలా చెక్ పెట్టారు.
తలపై త్రిశూల టోపీ..
ప్రధాని పర్యటన సమయంలో ఆయన ధరించిన టోపీ సైతం పెద్ద మెసేజే ఇస్తోంది. సాధారణ ఆర్మీ క్యాప్ కాదది. ఆ టోపీపై త్రిశూలం సింబల్ ఉంది. అది మన త్రివిధ దళాలకు సంకేతం. మన త్రిశూల వ్యూహానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్‌తో భరతమాత ఆది పరాశక్తిగా మారిన తరుణంలో అమ్మవారి చేతిలోని త్రిశూలానికి చిహ్నం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సమిష్టిగా పాకిస్తాన్‌పై పోరాడి శిక్షించిన తీరుకు సాక్ష్యం. ప్రధాని మోదీ ధరించిన క్యాప్‌తో అంత పెద్ద మెసేజ్ ఉందని అంటున్నారు. మొత్తంగా పీఎం మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ పర్యటనే ఓ స్ట్రాటజీక్ మూవ్ అని చెబుతున్నారు. దటీజ్ మోదీ. ఆయన ఏం చేసినా.. దానికో లెక్కుంటుంది.
Also Read : అణుబాంబు పేలితే ఎట్టా ఉంటాదో తెలుసా?