Posani Angry on Chandrbabu govt: వైసీపీ డర్టీ పాలిటిక్స్ మొదలు పెట్టిందా? తిరుమల లడ్డూ వివాదం నుంచి బయట పడేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తోందా? దీన్ని నుంచి బయట పడేందుకు తప్పుల మీద తప్పులు చేస్తోందా? జగన్ ది గ్రేట్ పాలిటిక్స్ అని పోసాని ఎందుకన్నారు? చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్ అనడం వెనుక అసలేం జరిగింది? ఇంకా డీటేల్స్‌లోకి వెళ్దాం.
వైసీపీకి ముఖ్యంగా జగన్‌కు అత్యంత ఇష్టమైన నేతల్లో నటుడు పోసాని కృష్ణమురళి ఒకరు. తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చాక, వైసీపీ నేతల మాటలు పెద్దగా ప్రజలకు కనెక్ట్ కాలేదు. దీంతో ఫైర్‌బ్రాండ్ పోసానిని రంగంలోకి దించేసింది.
ఇంకేముంది.. తనదైన శైలిలో పోసాని ప్రెస్‌మీట్ పెట్టి, హైకమాండ్ చెప్పాల్సిన నాలుగు ముక్కలను సినిమా స్టయిల్‌లో చెప్పేశారు. లడ్డూ వ్యవహారం మొదలై.. 10 రోజులు పైగానే గడిచింది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా స్పందించారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్‌పై నాలుగు రాళ్లు వేశారాయన.
వైసీపీ అధినేత జగన్ ది గ్రేట్ పాలిటీషియన్ అని, సీఎం చంద్రబాబు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు పోసాని. తిరుమలకు రావద్దని చెప్పడానికి సీఎం చంద్రబాబు ఎవరంటూ తొలి బాణం వేశారు. ఈ కథా రచయిత.. కూటమి నేతల మాటలను తప్పుగా ఆయన అర్థం చేసుకున్నట్లు కనిపించింది.
ALSO READ: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి
జగన్ ఏ పాపం చేశారని హింసిస్తున్నారని, తిరుమలను నాశనం చేయాలని కూటమి సర్కార్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు పోసాని. కొండపైకి వెళ్లడానికి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలన్నది ప్రధాన ప్రశ్న. తిరుమలకు రావొద్దని చెప్పడానికి ఆయనెవరన్నది మరో ప్రశ్న.
నారా లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ కోసం జగన్ భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పోసాని. ఎన్నికల తర్వాత వైసీపీ పనైపోయిందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తోంది. దానికి లోకేష్‌ను లింక్ చేశారు. మొత్తానికి ఫ్యాన్ పార్టీ పనైపోయిందని ఓపెన్‌గా నేతలు చెప్పుకోవడం గమనార్హం.