Bollywood Actress: చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు ఎప్పుడు ఏ రంగాన్ని ఎంచుకుంటారో చెప్పడం కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా కెరీర్ లో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం చేస్తూ.. సినిమా రంగం మీద ఉన్న ఇష్టంతో అనూహ్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. ఇక్కడ కొంతకాలం నటించి, ఆ తర్వాత మళ్లీ తమ గోల్ రీచ్ అవ్వడానికి ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. అలా ఒకానొక సమయంలో మహేష్ బాబు (Maheshbabu) తో రొమాన్స్ చేసి సక్సెస్ అందుకోలేక కెరియర్ పై దృష్టి పెట్టిన ఒక హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా అవతరించింది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వంశీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మయూరీ కాంగో..
ఆమె ఎవరో కాదు మయూరి కాంగో (Mayoori kango).. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘వంశీ’ సినిమాలో మహేష్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఇందులో మోడల్ పాత్రలో కనిపించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాకముందు ఐఐటి కాన్పూర్ లో అడ్మిషన్ పొందింది. కానీ బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో తన సీటును కాస్త వదులుకొని.. 1995లో హిందీలో వచ్చిన డ్రామా చిత్రం నసీమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
మయూరి కాంగో నటించిన చిత్రాలు..
మొదటి సినిమాతో పర్వాలేదనిపించుకున్న మయూరి ఆ తర్వాత పాప కెహెతే హై, బేటాబి, పాప ది గ్రేట్, జంగ్, శికారీ, బాదల్, హోగీ ప్యార్ కీ జీత్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan) వంటి హీరోలతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా హిందీలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తెలుగులో వంశీ తర్వాత మరో అవకాశాన్ని అందుకోలేక పోయింది.
వివాహం తర్వాత న్యూయార్కులో సెటిల్..
దాంతో 2003లో ఎన్ఆర్ఐ ఆదిత్యా థిల్లాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని.. న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది. 2011లో ఒక కొడుకుకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత బరూచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేసిన ఈమె.. గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్ అనే కంపెనీలో ఎండి హోదాలో పనిచేసింది. గూగుల్ ఇండియాలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ గా బాధ్యతలు కూడా చేపట్టిన ఈమె గూగుల్ డిజిటల్ స్ట్రాటజీస్ ఇన్నోవేషన్స్ విభాగంలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోయింది.
సీఈఓగా బాధ్యతలు..
ఇకపోతే ఇన్ని రోజులు విదేశాలలో సమయం గడిపిన ఈమె చివరికి ఇండియాకు మకాం మార్చింది.ప్రస్తుతం గుర్గావ్ లో తన బిడ్డను పెంచుతూ జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం పబ్లిసిస్ గ్రూప్ తో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. ఇక్కడ గ్లోబల్ డెలివరీ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టింది. ఏది ఏమైనా ఒకప్పుడు మహేష్ బాబు తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా సీఈవోగా బాధ్యతలు చేపట్టడంతో ఈమె టాలెంట్ కి అందరూ ఫిదా అవుతున్నారు.
https://www.linkedin.com/posts/mayoori-kango-1456a88_publicis-publicisgroupe-leadership-activity-7365611764824096768-b9QJ?utm_source=li_share&utm_content=feedcontent&utm_medium=g_dt_web&utm_campaign=copy
ALSO READ: Anchor Lobo: బిగ్ బ్రేకింగ్…. యాంకర్ లోబోకు జైలు శిక్ష!