Kethika Sharma : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశపురి నటించిన రొమాంటిక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.. అయితే ఆమెకు అనుకున్న గుర్తింపుని ఏ సినిమా తీసుకురాలేదు. ఇక ఇటీవల నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ఇది దా సర్ప్రైజ్ అంటూ అందరినీ సర్ప్రైజ్ చేసింది. సాంగ్ అయితే బాగా హీట్ అయింది కానీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. మళ్లీ ఈమె సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడింది. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొట్టేది. ఇదిలా ఉండగా తాజాగా ఈ అమ్మడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. సడన్గా సోషల్ మీడియాకు దూరమవుతున్నట్లు చెప్పడంతో ఫాన్స్ షాక్ కి గురయ్యారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈమె సోషల్ మీడియాకు దూరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాకు కేతిక గుడ్ బై..
ఈమధ్య హీరోయిన్లు సినిమాలు ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో పాటుగా.. తమ సినిమాల విషయాలను పంచుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. కొందరు బ్యూటీలు అయితే ఏకంగా సోషల్ మీడియాతో లక్షలు సంపాదిస్తున్నారు. ఆ లిస్టులోకి హాయ్ బ్యూటీ కేతిక శర్మ కూడా చేరింది. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉండే ఈమె సడన్గా సోషల్ మీడియాకు దూరమవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే చాట్ జిపిటితో డిజైన్ చేసిన తన ఫోటోని షేర్ చేస్తూ..’ సోషల్ మీడియా బ్రేక్’ అనే క్యాప్షన్ తో ఫోటో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మొదట కంగారుపడినా.. ఆ తర్వాత ‘విల్ బి బ్యాక్ సూన్’ అంటూ త్వరలోనే మళ్లీ వస్తాను అని ఇచ్చిన క్యాప్షన్ చూసి సంతోష పడుతున్నారు. అసలు ఎందుకు సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వనుంది..? అంత బిజీగా సినిమాలు చేస్తుందా? వేరే ఇతర కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ అమ్మడు క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..
Also Read : ఓరి నాయనో.. ఈ అమ్మాయి మామూల్ది కాదు.. ఓటు కోసం ఏకంగా..
కేతిక శర్మ కెరీర్ విషయానికొస్తే..
హాట్ బ్యూటీ ఢిల్లీకి చెందిన ముద్దుగుమ్మ. చదువు పూర్తవగానే మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈమె.. దబ్ స్మాష్ వీడియోలు.. మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమా రంగంలోకి రాకముందే భారీ పాపులారిటీ అందుకుంది.. పూరి జగన్నా తనయుడు ఆకాశపురి నటించిన రొమాంటిక్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీ ప్లాట్ఫారం కోసం చేసిన ప్రోమోలో మెరిసింది. లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి సినిమాలలో నటించింది.. ఇక నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం రాబిన్ హుడ్ లో ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు పెట్టుకుంది. త్వరలోనే వాటి గురించి పూర్తి వివరాలను తెలియజేసే అవకాశం ఉంది.