Bigg Boss Agnipariksha : తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఎదురుచూపులకు శుభం కార్డు పడనుంది. తెలుగు బిగ్‌బాస్ 9 షో కి రంగం సిద్ధమైంది. వచ్చేవారమే బిగ్‌బాస్ ప్రారంభం కానుంది. గత ఎడాది వచ్చిన సీజన్లో ఎక్కువగా సీరియల్ స్టార్స్ ఉండడంతో పెద్దగా ఆకట్టుకోలేదు. అందులోనూ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తి చూపించలేదు. కానీ ఈసారి మాత్రం సరికొత్తగా ఉండబోతుందంటూ ప్రోమో లో నాగార్జున చెప్పినట్లే బిగ్ బాస్ కోసం కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు.. సామాన్యుల కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో ని నిర్వహించింది.. ఇందులో కొందరిని ఫిల్టర్ చేసి బిగ్ బాస్ లోకి పంపించబోతుంది.. అయితే ఇక్కడ ఇచ్చిన టాస్కులలో అనూష బేష్ అనిపించుకుంది. ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
హౌస్ లోకి వెళ్లకముందే అనూష పై ట్రోల్స్..
కామన్ మ్యాన్ కోసం సెలక్షన్ జరుగుతోంది. హాట్‌స్టార్‌లో అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 15 మంది సెలక్టయ్యారు. వారికి రకరకాల గేమ్స్ పెడుతున్నారు. నచ్చినవారికి ఓట్లేసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చారు.. ఇక్కడ ఎక్కువ ఓట్లు వచ్చిన వారిలో ఇద్దరిని సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించే అవకాశం ఉందంటూ అటు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సెలెక్ట్ చేసిన వారిలో అనూష రత్నం. తాజాగా హాట్‌స్టార్ ఆమె ఓట్ అప్పీల్ చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అందులో అనూష మాట్లాడుతూ.. నేను ఎన్నో కష్టాలను అనుభవించాను.. ఉద్యోగం చేశా, ట్యూషన్ టీచర్‌గా చేశా.. కంటెంట్ క్రియేటర్‌గానూ పని చేశాను.. మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఉన్నాను. నా గొంతు ప్రతి ఒక్క ఇంట్లో వినిపించాలంటే కచ్చితంగా నన్ను మీరందరూ కలిసి ఓట్లు వేసి బిగ్ బాస్ లోకి పంపించాలని రిక్వెస్ట్ చేసింది. మీరు నాకు ఓట్లు వేస్తే మీ అందరూ గర్వపడేలా నేను నా సత్తా అని చూపిస్తాను అని అనూష ఆ వీడియోలో అనింది. తండ్రి మరణించడంతో చెల్లి చదువు బాధ్యతను తనే భుజాన వేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది..
Also Read : సూసైడ్ చేసుకోబోయిన కీర్తి.. నమ్మిన వాళ్ళే నాతో అలా..
అప్పుడేమో అలా…
గతంలో అనూష బిగ్ బాస్ గురించి దారుణంగా మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదంటే? అందరూ బిగ్‌బాస్, బిగ్‌బాస్ అని బట్టలు చించేసుకుంటున్నారు. ఎవడ్రా బిగ్‌బాస్ అని హేళన చేసింది. కట్ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.. ఆ రెండు వీడియోలని నెటిజన్లు క్రియేట్ చేసి మరి ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.. అప్పుడేమో ఎవడ్రా బిగ్ బాస్ అందింది. ఇప్పుడేమో అదే బిగ్ బాస్ లోకి వెళ్లి మరి ఇలా అడుక్కుంటుంది. ఆ తర్వాత హౌస్ లో ఇంకేం చేస్తుందో అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈమెకు జనాలు ఓట్లు వేసి హౌస్ లోకి పంపిస్తారా లేదా చూడాలి.. ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. వచ్చేనెల ఏడు నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈసారి ఎటువంటి కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతుందో…
?igsh=dmc2YXZqcmw0dXJ6