Intinti Ramayanam Today Episode August 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి శ్రేయ ఇద్దరూ కూడా.. అవనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటారు.. వంట గదిలో మిక్సీకి షాక్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. ముందుగా అవని వంట గదిలోకి వెళ్తుందని అందరూ అనుకుంటారు.. కానీ అవని మంట గదిలోంచి మళ్లీ బయటకు వస్తుంది ఆ తర్వాత వెంటనే పార్వతి అక్కడికి వెళ్తుంది. మిక్సీని ఆన్ చేయగానే షాక్ కొడుతుంది.. పార్వతి కేకలు విని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడుతూ వస్తారు.. ముందుగా అవని పార్వతిని కాపాడ్డానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో తనకి గాయం తగిలినా కూడా పట్టించుకోకుండా పార్వతిని షాక్ నుంచి బయటపడేస్తుంది.
పార్వతి కింద పడిపోవడంతో ప్రాణాలతో బయటపడిందని అందరు అనుకుంటారు. అయితే అందరూ పార్వతికి ఏమైందో అని కంగారుపడుతూ ఏడుస్తూ ఉంటారు.. పల్లవి సెట్ చేసిన మనుషులు అవనీని ఎలాగైనా అవమానించాలని అనుకుంటారు. పల్లవి సిగ్నల్ ఇవ్వడంతో అవని దగ్గరకొచ్చి దారుణంగా మాట్లాడుతారు.. అవన్నీ విన్న పార్వతి నోరు ముయ్యండి.. నా కోడలు గురించి మాట్లాడే అర్హత మీకెవరు ఇచ్చారు అని అరుస్తుంది. అంతేకాదు చెంప పగలగొడుతుంది.. అది చూసిన అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అసలు మీరేంటి మీ బతుకులు ఏంటి మీరు నా కోడలు అనే వాళ్ళ అని పార్వతి వచ్చిన వాళ్లని దుమ్ము దులిపేస్తుంది. ఇంట్లో పూజ జరుగుతుంది కాబట్టి మీరు బ్రతికి పోయారు. లేకుంటే అంటే చెప్పుతో కొట్టేదాన్ని అని పార్వతీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తుంది. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోండి అని పార్వతి అరుస్తుంది.. వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళగానే ఇంట్లోని వాళ్ళందరూ చప్పట్లు కొట్టి పార్వతి చేసిన మంచి పనికి మెచ్చుకుంటారు..
కమల్ నువ్వు సూపర్ అమ్మ చాలా బాగా మాట్లాడావు అని పార్వతికి ముద్దు పెట్టి మరి పొగిడేస్తాడు.. నువ్వు మాట్లాడుతుంటే నా రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఇదమ్మ నాకు కావాల్సింది వదిన గురించి నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి.. మీరు మళ్లీ కలిసిమెలిసి ఉండాలి అని పార్వతీతో అంటాడు.. ఇంకా ఇంట్లోనే వాళ్ళందరూ.. కమల్ అమ్మ చేసిన మంచి పని చాలా బాగుంది అని తనలో తానే సంతోషపడతాడు..
ఇక భానుమతి లోపలికి వెళ్లి కమలాకర్ ఫోటోతో మాట్లాడుతుంది.. అయ్యా చూసావా ఎంత ఆనందంగా ఉందో.. అవని పై కోపం పోయింది పార్వతికి. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటుంది.. ఇక కమలాకరు అక్కడికి వచ్చి నువ్వు చేసిన చాలా మంచి పని నీ మనవరాలు నీ కోడలు కలిసిపోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక నీ మనవడు మనవరాలు ఇద్దరు కలిసిపోతే ఇంకా బాగుంటుంది అని అంటాడు.
నేను ఇంత చేశాను కాబట్టే వాడు ఇప్పుడు అవని దగ్గరే ఉంటున్నాడు. నీ మొహం ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య కాశ్మీరు కన్యాకుమారి అంత దూరం ఉంది. ఇక భానుమతితో కమలాకర్ సరసాలు ఆడతాడు. అయితే భానుమతి తన కోరికను తీర్చమని అడుగుతుంది. నన్ను కూడా మీతో పాటు స్వర్గానికి తీసుకొని వెళ్ళండి ఒక్కసారి అక్కడ ఎలా ఉంటుందో చూసి వస్తాను అని అడుగుతుంది.. అయితే స్వర్గాని కంటే నేను చంపితేనే అక్కడికి వెళ్తావు అని అంటాడు.. నాకు ఏ స్వర్గం వద్దు ఏ నరకం వద్దు నేను ఇంకా కొన్ని రోజులు బతకాలి అని భానుమతి అంటుంది.. ఇక కమలాకర్ నుంచి మాయమైపోతాడు.
అప్పుడే అక్కడికి అక్షయ్ వస్తాడు. అమ్మ నాన్న వచ్చాడు నానమ్మ అని ఆరాధ్య పిలుస్తుంది. నువ్వు మాటిచ్చిన దాని ప్రకారం నిలబెట్టుకున్నావని నాకు చాలా సంతోషంగా ఉంది అని పార్వతి అంటుంది. అన్నయ్య నిన్న పూజకు రమ్మంటే రానన్నావ్ ఇప్పుడు వచ్చావా అని అందరూ అంటారు. ప్రణతి భరతులు కూడా మీరు వస్తారని అస్సలు అనుకోలేదు అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. నేను ఇక్కడికి వచ్చింది నా బాస్ కోసం అని తెలిస్తే వీళ్లు ఏమనుకుంటారు అని మౌనంగా ఉండిపోతాడు.
Also Read : బాలుకు క్లాస్ పీకిన మనోజ్.. మనోజ్ కొత్త బిజినెస్.. ప్రభావతికి మైండ్ బ్లాక్..
అప్పుడే ఇంటికి వాళ్ళ బాస్ వస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ బాస్ ని పరిచయం చేస్తాడు.. అయితే రాజేంద్రప్రసాద్ కాలేజీ ఫ్రెండ్ కావడంతో పార్వతి వాళ్ళిద్దరి సాన్నిత్యం చూసి కుళ్ళుకుంటుంది. ఇక అందరిని పరిచయం చేసావు నీ భార్యని కూడా పరిచయం చేయని ఆ వచ్చిన మేడమ్ అంటుంది. అక్షయ్ మాత్రం అవని దగ్గరికి వెళ్లి వేడుకుంటాడు. అక్షయ్ ని ఆట ఆడుకుంటుంది అవని. మొత్తానికి అయితే అవని అనుకున్న మాటని అక్షయ్ చేత చెప్పించుకుంటుంది. కానీ అవని మాత్రం బెట్టు చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…